ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని…

టెర్రరిజంను అమెరికా ఎలా ప్రోత్సహిస్తుంది?

జి.కె.గణేష్: టెర్రరిజంని అమెరికాయే మొదట్లో ప్రోత్సహిస్తుందని మీ వ్యాసాల్లో చదివాను. అదెలాగో వివరించగలరా? సమాధానం: ప్రపంచంలో వివిధ చోట్ల పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడుల గురించి గతంలో రాశాను. ఆ సంఘటనల గురించి రాసినప్పుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పినా, ఉండవచ్చని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సందర్భంలోనే వివరించాను. బహుశా అప్పటి వివరణలు మీ దృష్టికి వచ్చినట్లు లేదు.  ఏయే ఉగ్రవాద ఘటనలు జరిగాయో వివరిస్తూ వాటి వెనుక అమెరికా హస్తం…

భారత ఇస్లాంను దురాక్రమిస్తున్న వహాబీయిజం

భారత ముస్లిం మత వ్యవస్ధ క్రమంగా వహాబీయిజం చేతుల్లోకి వెళ్తోందని, దీనిని అరికట్టకపోతే విపరిణామాలు తప్పవని ముస్లిం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వచ్చిన భారత ఇస్లాం ను వహాబీయిజం దురాక్రమిస్తోందని, తద్వారా విద్వేష బీజాలు నాటుతూ ఉగ్రవాద భావాలను పెంపొందిస్తున్నదని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సూఫీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియా పెంచి పోషిస్తున్న వహాబీ ముస్లిం టెర్రరిజం ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో విధ్వంసం…

రష్యా టెర్రర్ దాడులకు కారణం సౌదీ?!

మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి. చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను…

ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో…