ఉక్రెయిన్: కాల్పుల విరమణపై చర్చిస్తున్న పశ్చిమ దేశాలు?!

జూన్ 3 తో ఉక్రెయిన్ యుద్ధం మొదలై 100 రోజులు గడిచాయి. ఉక్రెయిన్ బలగాలపై రష్యా ఫిరంగి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మెల్లగా అయినప్పటికీ ఉక్రెయిన్ లోని ఒక్కొక్క గ్రామం, పట్టణం రష్యా వశం లోకి వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బింకం ప్రదర్శన కూడా కొనసాగుతోంది. ఉక్రెయిన్ కు అమెరికా, ఈయూ ఆయుధ సరఫరా కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘతిస్తున్నాయని ఓవైపు ప్రశంసలు కురిపిస్తున్న అమెరికా, యూకే, ఈయూ లు మరో…

ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!

జపాన్ తన మిలటరీ విధానాన్ని మార్చుకుంటున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి, అణు బాంబు విధ్వంసం దరిమిలా జపాన్, ‘కేవలం ఆత్మరక్షణకే మిలటరీ’ అన్న విధానంతో తనకు తాను పరిమితులు విధించుకుంది. ఇప్పుడు ఆ విధానానికి చరమగీతం పాడుతోంది. తన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే జపాన్ మిలటరీ బడ్జెట్ ఇక నుండి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరగనుంది. జపాన్ అంతటితో ఆగటం లేదు. వివిధ దేశాలతో వరస…

పశ్చిమ దేశాల పంచ ముఖ ముట్టడికి రష్యా జవాబు ఇచ్చేనా!?

మానవ జాతి నాగరికత మరియు అభివృద్ధి, పరస్పర సహకారం మరియు సౌభ్రాతృత్వం, సమస్త మానవుల ప్రజాస్వామ్యం-సమానత్వం ఇవి మానవ సమాజం సాధించిన మహోన్నత విలువలు. ఈ విలువలతో పోల్చితే అమెరికా, పశ్చిమ దేశాలు తాము ఎంత అనాగరిక పాశవిక దశలో ఉన్నామో స్పష్టంగా తమ నోటి తోనే ప్రకటించుకుంటున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వారికి ఆ అవకాశం ఇచ్చింది. రష్యాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని పాటిస్తున్న…

రష్యాపై అమెరికా పగను ఇండియా పంచుకుంటుందా? -2

గత ఆర్టికల్ తరువాయి భాగం….. చిరకాల స్నేహం అనేక దశాబ్దాలుగా ఇండియా రష్యాపై ఆధారపడి ఉంది. ఆయుధాలు కావచ్చు. స్పేస్ టెక్నాలజీ కావచ్చు. మిసైల్ టెక్నాలజీ కావచ్చు. క్రయోజనిక్ టెక్నాలజీ కావచ్చు. చివరికి అణు విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఇండియాకు రష్యా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ వచ్చింది. ప్రపంచం అంతా అమెరికా నేతృత్వంలో ఇండియాను ఒంటరిని చేసి వెలివేసిన కాలంలో కూడా రష్యా ఇండియాతో స్నేహం, సహకారం, వాణిజ్యం మానలేదు. కానీ ఇండియాకు చైనాతో తగాదా…

ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

శాంతి చర్చలు: విరమణ దిశలో రష్యా ఉక్రెయిన్-దాడి?

ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడి మెల్లగా విరమించే వైపుగా వెళుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఇస్తాంబుల్ చర్చల దరిమిలా రష్యా నుండి వెలువడిన ప్రకటనలను బట్టి ఈ అభిప్రాయానికి రావలసి వస్తోంది. టర్కీ నగరం ఇస్తాంబుల్ లో ఇరు పక్షాల మధ్య జరుగుతున్న చర్చలలో ఉక్రెయిన్ నుండి నిర్దిష్టంగా స్పష్టమైన ప్రతిపాదనలు తమకు అందాయని రష్యన్ చర్చల బృందం ప్రకటించింది. “టర్కీ నగరం ఇస్తాంబుల్ లో మార్చి 29 తేదీన జరిగిన చర్చల…

బై బై డాలర్! సొంత కరెన్సీల్లో ఇండియా, రష్యా వాణిజ్యం

చిన్న రాజ్యాలు కొట్లాడుకుంటే పెద్ద రాజ్యం లాభపడుతుంది. అలాగే పెద్ద రాజ్యాలు కొట్లాడుకుంటే వాటి దగ్గర లాబీయింగ్ చేసే చిన్న రాజ్యాలు లబ్ది పొందుతాయి. ఓ వైపు ఒకప్పటి అగ్రరాజ్యం సోవియట్ రష్యా వారసురాలు రష్యా; మరో వైపు ఉక్రెయిన్ ని ముందు పెట్టి దాని భుజం మీద తుపాకి పెట్టి కాల్పులు జరుపుతున్న అమెరికా! ఉక్రెయిన్ లో రెండు పెద్ద రాజ్యాలు కొట్లాడుకుంటున్న నేపధ్యంలో ఇండియా వాణిజ్య పరంగా లబ్ది పొందుతోంది. ఈ లబ్ది రెండు…

నమ్మించి దగా చెయ్యటం అమెరికా విద్య -కార్టూన్

కువైట్ దేశం చారిత్రకంగా ఇరాక్ లో భాగం. చమురు వాణిజ్యం విషయమై కువైట్ తో ఇరాక్ కి సమస్య వచ్చింది. చర్చలు జరిగాయి. కువైట్ వినలేదు. ఇక భరించ లేము. కువైట్ ని కలుపుకుంటాం అని సద్దాం అమెరికాకి చెప్పాడు. ఆ విషయం మాకు సంబంధం లేదు. అది మీ సమస్య అని అమెరికా చెప్పింది. సద్దాం అమెరికాని నమ్మాడు. కువైట్ లోకి సైన్యాన్ని నడిపాడు. అంతే. అమెరికా గావు కేకలు వేసింది. సద్దాం పై రెండు…

ఉక్రెయిన్ తరపున విదేశీ కిరాయి సైనికులు!

ఉక్రెయిన్ తరపున అమెరికా, ఈ‌యూలు కిరాయి సైనికులను రంగంలోకి దింపుతున్నాయి. సొంత సైన్యాలను పంపితే అది రష్యాపై స్వయంగా యుద్ధం ప్రకటించినట్లు! అదే కిరాయి కోసం పని చేసే సైనికులను పంపితే వారు చచ్చినా, బ్రతికినా ‘మాకు సంబంధం లేదు’ అని సింపుల్ గా చేతులు దులుపుకోవచ్చు. పైగా యుద్ధం గెలిస్తే అనధికారికంగా క్రెడిట్ కూడా దక్కించుకోవచ్చు. కిరాయి సైనికులతో పాటు అమెరికాకు చెందిన ప్రైవేటు మిలట్రీ కంపెనీలు కూడా తమ బలగాలను ఉక్రెయిన్ తరపున యుద్ధరంగానికి…