సంచలన లీక్: కీవ్ హత్యలకు బాధ్యులు పశ్చిమ దేశాలేనా?

ఉక్రెయిన్ ఆందోళనలకు సంబంధించి ఓ సంచలన నిజం వెలుగు చూసింది. ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం కీవ్ వీధుల్లో చెలరేగిన హత్యాకాండ అనంతరం బలవంతంగా కూల్చివేయబడిన సంగతి తెలిసిందే. రష్యా అనుకూల అధ్యక్షుడుగా పశ్చిమ దేశాలు చెప్పే విక్టర్ యనుకోవిచ్ ఈ హత్యాకాండ జరిపించాడని పశ్చిమ దేశాలు, పత్రికలు ఆరోపించాయి. భవనాలపైన ఉన్న స్నైపర్లు ఆందోళనకారులపై కాల్పులు జరిపారని స్నైపర్లను నియోగించింది అధ్యక్షుడే అని అవి ఆరోపించాయి. అయితే 90 మందికి పైగా చనిపోయిన హత్యాకాండకు…

ఉక్రెయిన్: రష్యా సేనలు వెనక్కి, అమెరికాతో ఒప్పందం?

తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల నుండి రష్యా తమ సేనలను వెనక్కి రప్పించుకుంది. ఉక్రెయిన్ లో కుట్ర ద్వారా రష్యా వ్యతిరేక, ఇ.యు + అమెరికా అనుకూల శక్తులు బలవంతంగా అధికారం చేజిక్కించుకున్న నేపధ్యంలో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులో కొద్ది రోజులుగాసైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాలను చాలించుకుని ఇక బ్యారక్ లను చేరుకోవాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు ఇవ్వడంతో రష్యా సేనలు వెనక్కి వెళ్ళాయి. దీనితో అమెరికా + ఇ.యు మరియు రష్యాల మధ్య అంతర్గతంగా…

రష్యా అదుపులో క్రిమియా, నీతులు వల్లిస్తున్న అమెరికా

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే స్ధితికి చేరింది. యూరోపియన్ యూనియన్ లో చేరడానికి నిరాకరించినందుకు అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ లో హింసాత్మక చర్యలు రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఆందోళనలు చివరికి అధ్యక్షుడు యనుకోవిచ్ ను దేశం విడిచి వెళ్లిపోయేలా చేశాయి. అనంతరం ఇ.యు, అమెరికా అనుకూల శక్తులు, నాజీ తరహా జాతీయ విద్వేష పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను, పార్లమెంటును స్వాధీనం చేసుకున్నాయి.…