ట్రంప్ ప్రొటెక్షనిజం – ఇండియా జపాన్ ల వాణిజ్య వైరం
డోనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం ప్రతిపాదించిన రక్షిత (ప్రొటెక్షనిస్టు) విధానాలు అప్పుడే ప్రభావం చూపిస్తున్నాయి. ఆరంభ రోజుల్లోనే ఇండియాపై ఆయన ప్రభుత్వం పడటం విశేషం. అయితే హెచ్1బి వీసాల రద్దు లేదా కుదింపు రూపంలో ఇండియాపై దెబ్బ పడుతుందని ఊహిస్తుండగా వాణిజ్య రంగంలో ఇండియాపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం ట్రంప్ వల్ల నేరుగా కాకుండా పరోక్షంగా పడటం మరో విశేషం. ఇండియా అనుసరిస్తున్న ‘ప్రొటెక్షనిస్టు’ విధానాల వలన తమ ఉక్కు ఎగుమతులు తీవ్రంగా…