కోకోకోలాపై పెరుందురై ప్రజల విజయం

ప్రజలు ఎక్కడ తిరగబడుతున్నారు అని ప్రశ్నిస్తున్న అమాయక బుద్ధి జీవులకు తమిళనాడులోని పెరుందురై ప్రజలు సమయానుకూల సమాధానం ఇచ్చారు. నీటి వనరులను పీల్చి పంటల్ని పిప్పి చేసే కోకోకోలా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడడంతో కోకోకోలాకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కోకోకోలాకు భూములపై ఇచ్చిన లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పెరుందురై ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక సంస్ధ…