ఒక సి.ఎం, 8 నేతలు, 500 అధికారులు, రు.1827 కోట్లు.. ఇదీ మైనింగ్ కుంభకోణం!

ఇది కుంభకోణాల యుగం. నిజానికి నల్లదొరల పాలన అంతా కుంభకోణాల మయమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు తప్ప స్వాతంత్ర్యం వలన భారత ప్రజా కోటికి ఒరిగిందేమీ లేదన్నది నిష్టర సత్యంగా నానాటికీ రుజువౌతోంది. ఎవరూ గట్టి ప్రయత్నం చేయకుండానే రాజకీయ నాయకులు తమ మధ్య రగిలే కుమ్ములాటలవలన, రాజకీయ విభేధాల వలన తమ అవినీతి కార్యకలాపాలను బయట పెట్టుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల అలవిగాని సంపదల గుట్టుమట్టులని బైట పెట్టడం అనేది ఎన్నికల రాజకీయాల్లో…