స్ధూల, సూక్ష్మ ఆర్ధిక శాస్త్రాలు -ఈనాడు

మైక్రో ఎకనమిక్స్, మాక్రో ఎకనమిక్స్! తరచుగా వినే ఈ పదాలకు అర్ధం ఏమిటో చూచాయగా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నిర్దిష్టంగా సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేస్తే చాలా మంది కాస్త తడబడతారు. ఈ పదాలపై నిర్దిష్ట అవగాహన ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ అంశాన్ని గురించి ఈ రోజు ఈనాడులో చర్చించాను. ఆంగ్లంలో మైక్రో ఎకనమిక్స్ పదం గానీ, మాక్రో ఎకనమిక్స్ పదం గానీ రెండు పదాలుగా ఉండవు. అంతా కలిపి ఒకే పదం. Microeconomics…

చెల్లింపుల సమతూకం (BoP) అంటే… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ లో చెల్లింపుల సమతూకం (Balance of Payments) ఒక ముఖ్యమైన అంశం. ఒక దేశం తన అవసరాల రీత్యా (ఉదా: దిగుమతులు) విదేశాలకు చెల్లింపులు చేయగల స్ధితిలో ఉన్నదా లేదా అన్నది ఆ దేశ BoP తెలియజేస్తుంది. పేరులో ఉన్నట్లు BoP అంటే చెల్లింపులు చేయడం కాదు. అది ఒక ఆర్థిక ప్రకటన. ఒక కంపెనీ ఆర్ధిక పరిస్ధితిని ఆ కంపెనీ యేటా ప్రకటించే బ్యాలన్స్ షీట్ తెలియజేసినట్లే ఒక…

లిక్విడిటీ ఆంటే? -ఈనాడు

బిజినెస్ వార్తల్లో మనం తరచుగా వినే/చదివే మాట ‘లిక్విడిటీ.’ వివిధ ఆస్తులకు ఎంత లిక్విడిటీ ఉందన్న విషయంపై ఆధారపడి వాటికి కొనుగోలుదారులు లభిస్తారు. లిక్విడ్ అంటే ద్రవం. ద్రవం ఒక చోట నిలబడేది కాదు. దాన్ని ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర రూపంలో నిలబడి ఉంటుంది. నియంత్రించే పాత్ర ఏమీ లేకపోతే అది తేలికగా ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండానే ప్రవహిస్తుంది. ఈ కారణం చేతనే ఒక ఆస్తిని డబ్బుగా మార్చగల సామర్ధ్యాన్ని లిక్విడిటీ అన్నారు.…

జి.డి.పిని ఎలా లెక్కిస్తారు? -ఈనాడు

ఈ రోజుల్లో జి.డి.పి గురించి విననివారు చాలా తక్కువ మంది. జి.డి.పి ని తెలుగులో స్ధూల జాతీయోత్పత్తిగా చాలామంది అనువదిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. జి.డి.పిని స్ధూల దేశీయోత్పత్తి అనడం కరెక్ట్. జి.ఎన్.పి ని స్ధూల జాతీయోత్పత్తిగా అనువాదం చేయాలి. అయితే జి.ఎన్.పి వాడుకలో లేని పదం. ఎకనమిక్ ఫండమెంటల్స్ జాబితాలో జి.ఎన్.పికి ప్రాముఖ్యం లేదు. అందువలన స్ధూల జాతీయోత్పత్తి అన్నా జి.డి.పియే అన్న వాడుక వచ్చేసింది. కానీ జి.ఎన్.పి గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసేటప్పుడు…

జి.డి.పిలు, కరెన్సీ విలువల తేడాలు -ఈనాడు

ఈ రోజు ఈనాడు పత్రికలో వివిధ జి.డి.పిల గురించి, కరెన్సీల మధ్య తేడాల గురించి చర్చించాను. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ లెక్కన ఇండియా జి.డి.పి మూడో స్ధానంలో ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఐ.ఎం.ఎఫ్ ప్రకటించింది. ఈ అంచనాను మన పత్రికలు సగర్వంగా రాసుకుని గర్వించాయి. దీన్ని చదివిన కొందరు మేధావులు మనకు తెలియకుండానే మనం అగ్రరాజ్యం స్ధానానికి చేరిపోతున్నామన్న భ్రమలో పడిపోయారు. వాస్తవానికి అసలు జి.డి.పియే దేశ ఆర్ధిక స్ధితిగతులను సరిగ్గా ప్రతిబింబించదు. పి.పి.పి జి.డి.పి…

ఈనాడు ఆర్టికల్స్ రెండవ సిరీస్ -లంకెలు

ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో నా ఆర్టికల్ ప్రచురితం కాలేదు. మరో ఆర్టికల్ కు సంబంధించి పెద్ద టేబుల్ ఒకటి ఇవ్వవలసి రావడంతో చోటు సరిపోలేదని, దానితో ఒక ఆర్టికల్ ను మినహాయించవలసి వచ్చిందని పత్రిక వారు సమాచారం ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఈనాడు ఆర్టికల్స్ రెండవ సిరీస్ లోని ఆర్టికల్స్ అన్నింటికీ లంకెలు ఇస్తే పాఠకులకు ఉపయోగం అన్న ఆలోచన వచ్చింది. గతంలోని ఆర్టికల్స్ మిస్ అయినవారికి ఇది ఉపయోగం. చదివిన వారికి…

స్వదేశీ విదేశీ అప్పులూ, సార్వభౌమ ఋణ పత్రాలూ… -ఈనాడు

“పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్” అంటాడు గిరీశం మహాకవి గురజాడ వారి కన్యాశుల్కం నాటకం నాటకంలో. పొగ తాగడం అనివార్యం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆనక ఆ ప్రాతిపదికన తన అలవాటును గొప్పదిగా ఎస్టాబ్లిష్ చేయడానికి గిరీశం ఆ మాట చెప్పాడు. అప్పు సంగతి దాదాపు అలాంటిదే. పొగ అవసరం లేకపోయినా ఉందని గిరీశం ఎస్టాబ్లిష్ చెయ్యబోయాడు. అప్పు అవసరం మాత్రం నిజంగానే అనివార్యం. ఎందుకని అనివార్యం? నిజానికి ఎవరి శ్రమకు తగిన సంపాదన వారికి…

డబ్బు ఎలా ఏర్పడింది? -ఈనాడు

డబ్బు విషయంలో కొద్దిమంది సంతృప్తిగా ఉన్నప్పటికీ అనేకమంది అసంతృప్తి ప్రకటిస్తుంటారు. జీవితంలో ఏదో ఒక క్షణంలో డబ్బుని కనిపెట్టినవాడిని పట్టుకుని తన్నాలనిపించే ఆలోచన కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి డబ్బు గురించి ఈ రోజు ఈనాడు పత్రికలో చర్చించబడింది. డబ్బు అంటే మనకు తెలిసింది నోట్ల కట్టలు, నాణేలు మాత్రమే. డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు లేదా బాండ్లు (వీటిని సావరిన్ బాండ్లు లేదా సార్వభౌమ ఋణ పత్రాలు అంటారు), బ్యాంకులు…

ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఆర్ధిక మౌలికాంశాల్లో (ఎకనమిక్ ఫండమెంటల్స్) ద్రవ్యోల్బణం ఒకటి. ద్రవ్యోల్బణం గురించి ఆర్ధికవేత్తలు అనేక సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలన్నీ మనిషి సృష్టించిన కృత్రిమ మారక సాధనం అయిన డబ్బు చుట్టూనే తిరుగుతాయి. ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు. ఫలితంగా ఆ సిద్ధాంతాలన్నీ వాస్తవ పరిస్ధితులకు దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం అవుతాయి. దాంతో మళ్ళీ మళ్ళీ సరికొత్త సిద్ధాంతాలతో ఆర్ధికవేత్తలు ముందుకు రావడానికి పరిస్ధితులు…

అధిక ఫిస్కల్ లోటు ఋణ సంక్షోభానికి దారి -ఈనాడు

ఈ వారం ఈనాడు పత్రికలో ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ ల గురించి చర్చించాను. మార్కెట్ ఎకానమీ ఉన్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు) కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు నెలకొని ఉన్నప్పుడు, “మన ఎకనమిక్ ఫండమెంటల్స్ స్ధిరంగా ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు” అని ఆర్ధిక మంత్రులు, ప్రధాన మంత్రులు మేకపోతు గాంభీర్యంతో చెబుతుంటారు. అలాంటి ఫండమెంటల్స్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి. ప్రభుత్వాలు రాబడి కంటే ఖర్చు…

ఆర్ధిక చక్రగతి, లోటు బడ్జెట్ లూ… -ఈనాడు

‘ఎకనమిక్ సైకిల్’ అన్న మాటను తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఆర్ధిక సంక్షోభాల సమయంలో ఈ పదం ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ఎకనమిక్ సైకిల్ కు సంబంధించిన అనుభవాలు సంక్షోభ సమయంలోనే ఎక్కువగా ఉండడం అందుకు కారణం. ఆర్ధిక చక్రం అనే కాదు, ఎన్నడూ వినని ఇతర ఆర్ధిక పదజాలం కూడా సంక్షోభాల సమయంలో ఎక్కువగా వినిపిస్తాయి. గత రెండు శతాబ్దాలుగా సంక్షోభాల మధ్య కాలం తగ్గుతూ వస్తోంది. అనగా ఆర్ధిక చక్రం వేగంగా తీరుగుతోంది అన్నట్లు. ఫలితంగా…

ఉత్పాదక, అనుత్పాదక వ్యయాలు -ఈనాడు

అధ్యయనం శీర్షికన వెలువడిన వ్యాస పరంపర పోయిన వారం కాక అంతకు ముందు వారంతో ముగిసింది. ఓ వారం విరామం తర్వాత స్ధూల ఆర్ధిక శాస్త్ర పదజాలాన్ని వివరించే ప్రయత్నం మొదలు పెట్టాను. డ్రై సబ్జెక్ట్ గా పేరుంది కనుక వీలనయింత తడిని అద్ది పాఠకులకు ఇవ్వాలనేది నా ప్రయత్నం. అందుకోసం సంభాషణల ద్వారా ఆర్ధిక పదజాలాన్ని వివరించగలిగితే పాఠకులకు మరింత తేలికగా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాను ఈ వారం అమలు చేశాను.…

సబ్సిడీలు ప్రజాస్వామ్య సాధనకు మార్గం -ఈనాడు

‘అధ్యయనం’ సిరీస్ లో 9వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో ప్రచురించబడింది. పత్రిక చదివిన కొందరు మిత్రులు ‘అలా అర్ధం కాకుండా రాస్తే ఎలా?’ అని నిలదీశారు.  స్ధలాభావం వల్ల కత్తిరింపులకు గురి కావడంతో కొన్ని చోట్ల వివిధ అంశాలకు మధ్య లంకెలు మిస్ అయ్యాయి. దానితో అర్ధం కానట్లుగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఈనాడు ప్రచురణను కింద ఇస్తున్నాను. బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.…

ఆసక్తికరంగా అర్ధ శాస్త్రం -ఈనాడు

అధ్యయనం సిరీస్ లో 8వ భాగం ఈ వారం ఈనాడులో ప్రచురితం అయింది. నిత్య జీవితాలకు అన్వయించుకుంటూ అర్ధ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే తేలికగా మెదడులోకి ఇంకుతుంది. ఈ అంశాన్ని ఈ వారం చర్చించాను. అర్ధశాస్త్రం ఆర్ధిక పండితులకు మాత్రమే కాకుండా జనానికీ అవసరమే అని అవగాహన కలగడానికి గత వారం, ఈ వారం భాగాలు ఉపయోగపడతాయి. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేయండి. ఈ…

రాజకీయార్ధిక కోణంలో సమాజ విశ్లేషణ -ఈనాడు

ఈ రోజు నుండి ఈనాడు పత్రికలో ‘పొలిటికల్ ఎకానమీ’ కోణంలో సమాజాన్ని అర్ధం చేసుకోవడం ఎలా అన్న అంశంపై వ్యాసావళి ప్రారంభించాను. సమాజాన్ని, అందులో పరస్పర సంబంధంతో కలగలిసిపోయి ఉండే వివిధ అంశాలను వివిధ శాస్త్రాలుగా విడగొట్టుకుని చదువుకుంటున్నాం గానీ సామాజిక ఆచరణలో అవన్నీ ఒకటే. సామాజిక జీవనంలో రాజకీయార్ధిక కోణం అత్యంత ముఖ్యమైనది. సామాజిక జీవనానికి అదే పునాది కూడా. దీన్ని సరళంగా అర్ధం చేసుకోగలిగితే ఒక తాత్విక దృక్పధాన్ని అలవారుచుకోవడం తేలిక అవుతుంది. ఉన్నత…