ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…

సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న ఈజిప్టు ప్రజల ఆగ్రహం

ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

విమోచనా కూడలిలో ఆందోళనకారులను బలవంతంగా తొలంగించిన సైన్యం

ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు. అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

ముబారక్ నియమించిన ఈజిప్టు ప్రధాని రాజీనామా

  ఈజిప్టు మాజీ అధ్యక్షుడు తన చివరి రోజులలో నియమించిన ప్రధాని అహ్మద్ షఫిక్ గురువారం రాజీనామా చేశాడు. ముబారక్ కు సన్నిహితుడుగా భావిస్తున్న షఫిక్ తొలగింపు కూడా ఆందోళనకారుల డిమాండ్లలో ఒకటి. మిలట్రీ కౌన్సిల్ షఫిక్ రాజీనామాను ఆమోదించినట్లుగా తన ఫేస్ బుక్ పేజీ లో ప్రకటించింది. రవాణా శాఖ మాజీ మంత్రి ఎస్సామ్ షరాఫ్ ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లుగా కూడా కౌన్సిల్ తెలిపింది. సోమవారం నాడు ముబారక్, అతని కుటుంబ…

సమ్మెలకు ఉద్యుక్తులవుతున్న ఈజిప్టు కార్మికులు, ఉద్యోగులు

ముబారక్ నియంతృత్వ పాలనకు పద్దెనిమిది రోజుల ఆందోళనతో తెర దించిన స్ఫూర్తితో ఈజిప్టులోని వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కొన్ని విభాగాల్లో ఇప్పటికే ఆందోళనలు ప్రారంభమయ్యాయి కూడా. సోమవారం సెంట్రల్ కైరోలో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ అలెగ్జాండ్రియా’ బ్రాంచి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వందల మంది కార్యాలయం బయట చేరుకుని తమ అధికారులను పదవి నుండి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ముబారక్ ను వెళ్ళిపొమ్మన్నట్లే వారిని…

నిష్క్రమించిన ఆందోళనకారులు, కొన్ని డిమాండ్లు నెరవేర్చిన మిలట్రీ పాలకులు

  ఆందోళనకారుల డిమాండ్లలో కొన్నంటిని మిలట్రీ పాలకులు నెరవేర్చడంతో వారు విమోచనా కూడలిని వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళడానికి నిరాకరించిన కొద్దిమందిని అరెస్టు చేసినట్టు సమాచారం. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా మిలిట్రీ కౌన్సిల్ ప్రకటించింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా అనేక పార్టీలను ముబారక్ ఎప్పటిలాగే నిషేధించడంతో పార్లమెంటులో అత్యధికులు ముబారక్ పార్టీవారే మిగిలారు. ముబారక్ పార్టీ యధేఛ్చగా రిగ్గింగ్ చేసే అచారం ఈజిప్టులో ఉంది. అందువలన పార్లమెంటును…

విమోచనా కూడలిని వదలని ఈజిప్టు ఆందోళనకారులు, పెదవి విప్పని సైన్యం

  ముబారక్ గద్దె దిగిపోయాక ఇళ్ళకు వెళ్ళిపోతారనుకున్న ఈజిప్టు ఆందోళనకారులు తాహ్రిరి స్క్వేర్ (విమోచనా కూడలి) ను ఇంకా వదిలి వెళ్ళలేదు. ప్రజాస్వామ్య పరిపాలన స్ధాపించబడే వరకు తాము వెళ్ళేది లేదని వారు పంతం పట్టారు. శనివారం సాయంత్రం సైన్యం ప్రదర్శకులను పంపించివేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఆందోళన ప్రారంభ దినాల్లో ప్రదర్శకులపై హింసాత్మక దాడులు జరిపి వందల మంది మరణించడానికి కారకులై ప్రజల్లో అపఖ్యాతి పాలైన మిలట్రీ పోలీసులు తిరిగి “విమోచనా కూడలి” వద్ద మొహరించడం…

సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ఎట్టకేలకు ముబారక్ రాజీనామా, ఆనందోత్సాహాల్లో ఈజిప్టు ప్రజలు

  కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు…

పదవిని వీడని ముబారక్, అమెరికా సూచన బేఖాతరు

గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు.…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…