ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ

ఈజిప్టు మళ్ళీ రక్తం ఓడుతోంది. వదిలిందనుకున్న మిలట్రీ పిశాచం మళ్ళీ ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రెండేళ్ల క్రితం 2011లో సంభవించిన ప్రజా తిరుగుబాటులో హోస్ని ముబారక్ పదవీచ్యుతుడయిన సంగతి తెలిసిందే. దరిమిలా అధికార పగ్గాలను తాత్కాలికంగా కోల్పోయిన ఈజిప్టు మిలట్రీ, ప్రజాస్వామిక ఎన్నికల్లో అధ్యక్ష పదవి చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహమ్మద్ మోర్శి ని గత జులై మొదటివారంలో కుట్ర చేసి కూల్చివేసింది. మోర్శికి మళ్ళీ అధికారం అప్పజెప్పాలని దేశవ్యాపితంగా బైఠాయింపులు, ప్రదర్శనలతో…

ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్

ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ప్రపంచంలో ఎన్ని నియంతృత్వాలు పని చేయగలవో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓట్ల కోసం మద్యం, డబ్బు, బంగారం దగ్గర్నుండి క్రికెట్ కిట్ల వరకూ పంచి పెట్టినా అది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసే మిలట్రీ అధికారులు కూడా ‘ప్రజాస్వామ్యం కోసమే కుట్ర చేశాం’ అని చెబుతారు. అదే నోటితో ‘త్వరలోనే ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వానికి అధికారం అప్పజెబుతాం’ అని కూడా చెబుతారు. చివరికి హిట్లర్ కూడా తనది ప్రజాస్వామ్య పాలనే…

ఈజిప్టులో అధికార కుమ్ములాటలు తీవ్రం, అధ్యక్షుడి డిక్రీ రద్దు చేసిన కోర్టు

ఈజిప్టులో పాత, కొత్త అధికార వర్గాల మధ్య ఘర్షణలు మరో అంకానికి చేరాయి. కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ అధ్యక్షుడు ముర్సి జారీ చేసిన డిక్రీ ని కోర్టు కొట్టివేసిందని బి.బి.సి తెలిపింది. ముప్ఫై యేళ్ళుగా ఈజిప్టును తన కబంధ హస్తాల్లో బంధించిన మిలట్రీ నియంతృత్వ పాలకుల ప్రయోజనాలకు ప్రతినిధిగా భావిస్తున్న ‘సుప్రీం కాన్సిటిట్యూషనల్ కోర్టు’ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజా తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన పార్లమెంటుకు మిలట్రీ పాలకుల…

ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ

ఈజిప్టు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు రద్దు, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర, సర్వాధికారాలను తిరిగి చేజిక్కించుకోవడం మొదలయిన చర్యల ద్వారా ఈజిప్టు మిలట్రీ దేశ ప్రజల రక్తతర్పణకు విలువ లేకుండా చేసింది. మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయ బలా బలాలపై గణనీయమైన ప్రభావం పడనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఈజిప్టు ప్రభుత్వంలోని సర్వాధికారాలనూ మిలట్రీ తిరిగి చేజిక్కించుకుని ఎన్నికలు నామమాత్రమేనని నిరూపించింది. మాజీ నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దించి ప్రజాస్వామిక గాలులను రుచి చూద్దామని…

అధికారం కోసం కుమ్ములాటలో ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమాధి

ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో…

ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు

ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేసినట్లు ఈజిప్టు ఉద్యమ నిర్మాణంలో ట్విట్టర్, ఫేస్ బుక్ ల పాత్ర ఏమీ లేదు. ఉద్యమ వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రాసుకున్నారు గానీ ఉద్యమ వ్యాప్తికి అవేమీ ఉపయోగపడలేదు. అసలు ట్విట్టర్,  ఫేస్ బుక్ ల ద్వారా ఉద్యమాలు వస్తాయనడమే పెద్ద తప్పు, మోసం కూడా. కేవలం ఇంటర్నెట్ లో సందేశాలతో ఉద్యమ కాంక్షలను రగిల్చే పనైతే ఫేస్ బుక్ లో కాజ్ ల పేరుతో…

“డే ఆఫ్ డిపార్చర్” పాటిస్తున్న ఈజిప్టు జనం, తెర వెనుక అమెరికా బిజీ

ఈజిప్టులో ఆందోళనకారులు ముబారక్ శుక్రవారం (ఫిబ్రవరి ౪) లోగా రాజీనామా చేయాలని గడువు విధించిన సంగతి విదితమే. తమ డిమాండును గట్టిగా వినిపించటానికి శుక్రవారం అన్ని ప్రధాన పట్టణాలలో ప్రజలు పదుల వేల సంఖ్యలో చేరుతున్నట్లుగా బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రెసిడెంటు గా తానూ విసిగిపోయాననీ, కానీ తాను దిగిపోతే దేశంలో అల్లకల్లోల పరిస్థిలు ఏర్పడతాయి కనుక తాను రాజీనామా చేయబోననీ ముబారక్ ప్రకటించాడు. ఆందోళనకారుల నాయకుల్లో ఒకరైన్ అల్ బరాదీ అధ్యక్షునికి సమధానం ఇస్తూ…

ఈజిప్టు అధ్యక్షుడు రాజీనామా చేస్తాడా?

ఈజిప్టు అధ్యక్షుదు హొస్నీ ముబారక్ రాజీనామా చేయాలనంటూ ఈజిప్తు ప్రజలు గత పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ప్రజలు ఈ శుక్రవారం లోగ అధ్యక్ష్తుదు రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చిన సంగతీ తెలిసిందే. గత పది రోజులుగా వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు ఠారెత్తిన ముబారక్ శుక్రవారం నాడు తాను రాజీనామా చేయటానికి అంగీకరిస్తూనే ఒక మెలిక పెట్టాడు. తనకు రాజీనామా చేయాలనే ఉన్నప్పటకీ తన రాజీనామా తర్వాత దేశంలో అల్లర్లు తలెత్తుతాయేమోనని…