ఈజిప్టు ఎన్నికల్లో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ పై చేయి, ‘రనాఫ్’ తధ్యం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అభ్యర్ధి మహమ్మద్ ముర్సి దాదాపు పై చేయి సాధించాడు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని ప్రెస్ టి.వి తెలిపింది. 26 శాతం ఓట్లతో ముర్సి ముందంజలో ఉండగా, మాజీ నియంత హోస్నీ ముబారక్ ప్రభుత్వంలో చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫిక్ 24 శాతం ఓట్లతో రెండవ స్ధానంలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది.  వీరి ఓట్ల శాతం వరుసగా 25 శాతం, 23 శాతం…

ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న…

క్లుప్తంగా…. 30.04.2012

జాతీయం లండన్ ఒలింపిక్స్ ని ఇండియా బహిష్కరించాలి -భోపాల్ బాధితుడు “డౌ కెమికల్స్” కంపెనీ సొమ్ముతో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ ను ఇండియా అధికారికంగా బహిష్కరించాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితుడు సంజయ్ వర్మ డిమాండ్ చేశాడు. గ్యాస్ లీక్ ప్రమాదానికి ఐదు నెలల ముందు జన్మించిన సంజయ్ గ్యాస్ దుర్ఘటన వల్ల అనాధగా మారాడని ‘ది హిందూ’ తెలిపింది. డౌ కంపెనీ చేతులకు భోపాల్ బాధితుల రక్తం అంటిందని, ఆ రక్తం ఇపుడు లండన్ పయనమైందని…

అధికారం కోసం కుమ్ములాటలో ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమాధి

ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో…

ఈజిప్టు ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగాయట -కార్టూన్

ఈజిప్టు నియంత ముబారక్ గద్దె దిగి పది నెలల తర్వాత అక్కడి సైనిక ప్రభుత్వం ఈజిప్టు చట్ట సభలకు ఎన్నికలు ఈరోజు నిర్వహించింది. నిన్నటి వరకూ అక్కడ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించిన ప్రజలపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొన్ని వందలమందిని కాల్చి చంపింది. కొన్ని వేలమందిని అరెస్టు చేసి జైళ్లలో కుక్కింది. ఉన్న ప్రజాస్వామ్య హక్కులన్ని హరించివేసి ప్రశాంతంగా మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నికలను నిర్వహించింది. జనవరి ఉద్యమం డిమాండ్…