అసాంజే: బ్రిటన్ అప్పీలు తిరస్కరణ

వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే విడుదలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. అసాంజేను వెంటనే విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఐరాస తీర్పుకు వ్యతిరేకంగా బ్రిటన్ చేసిన అప్పీలును ఐరాస రెండోసారి కూడా తిరస్కరించడంతో అయన విడుదల దాదాపు అనివార్యం అయింది. అయితే అసాంజేను విడుదల చేస్తారా లేదా మరో సాకు వెతికి పట్టుకుని నిర్బంధం కొనసాగిస్తారా అన్నది తెలియరాలేదు.  నాలుగు సంవత్సరాలుగా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో అసాంజే బందీగా ఉన్న…

ప్రశ్న: తన ప్రజల్ని చల్లగా చూసుకునే దేశమే లేదా?

ఎస్. రామ కృష్ణ రావు: Thanks for publishing my question in QA and detailed analysis. Let me ask you differently. Actually my intention behind asking the question was in which country typical common people are living with more peace & happily? Is it China (as it became financially stronger) or America (good governance) or England, Singapore…

మానవహక్కుల శిక్షణకు నిధులిస్తా తీసుకో, అమెరికాతో ఈక్వడార్

సార్వభౌమాధికార దేశం అంటే ఇదిగో ఇలా ఉండాలి! ఎంత చిన్న దేశం అయితేనేం, తన సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా ఐనా భంగం కలిగించే పెత్తందారీ హెచ్చరికల మొఖం మీద చాచికొట్టినట్లు సమాధానం చెప్పగలిగిన సత్తా ఉన్నపుడు! ఈక్వడార్ ఇప్పుడు అదే చేస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇస్తే ఈక్వడార్ కు లబ్ది చేకూర్చే రెండు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని అమెరికా హెచ్చరించిన గంటలలోపే ఈక్వడార్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. రష్యా టుడే ప్రకారం,…

స్నోడెన్: ఈక్వడార్ కు అమెరికా బెదిరింపులు

ఇంటర్నెట్ కంపెనీల ద్వారా ప్రపంచ ప్రజలపై అమెరికా సాగిస్తున్న గూఢచర్యాన్ని, ఏకాంత హక్కుల ఉల్లంఘనను వెల్లడి చేసిన మాజీ సి.ఐ.ఏ టెక్నీషియన్ ఎడ్వర్డ్ స్నోడెన్ కేంద్రంగా అమెరికా బెదిరింపులు కొనసాగుతున్నాయి. మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ ను వెంటనే తమకు అప్పగించాలనీ, లేకపోతే రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించిన అమెరికా, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపుతున్న ఈక్వడార్ ను తీవ్రంగా బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం లోని వివిధ నాయకులు, అధికారులు ఈక్వడార్ పై వాణిజ్య…

స్నోడెన్ కి షెల్టర్ ఇచ్చారా, జాగ్రత్త! అమెరికా హెచ్చరిక

అమెరికా తన సామ్రాజ్యవాద దురహంకార స్వభావాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా మరోసారి చాటుకుంది. సి.ఐ.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ హాంగ్ కాంగ్ వీడి రష్యా వెళ్ళిన నేపధ్యంలో ఆయనకు ఏ దేశమూ షెల్టర్ ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరించింది. విద్రోహ నేరం కింద అమెరికాలో ఆయనపై కేసులు నమోదయ్యాయని కాబట్టి ఏ దేశమూ ఆయనకు రక్షణ ఇవ్వడం గానీ, తన గగనతలం గుండా ప్రయాణించే అవకాశం కల్పించడం గానీ చేయరాదని అమెరికా అధికారి ఒకరు హెచ్చరించినట్లు…

ఆసాంజే అరెస్టుకి బ్రిటన్ రహస్య పధకం

ఈక్వడార్ రాయబార కార్యాలయంలో శరణు పొందిన జూలియన్ ఆసాంజే ని ఏ పరిస్ధితిలోనైనా అరెస్టు చెయ్యాల్సిందేనని లండన్ పోలీసులకు వచ్చిన రహస్య ఆదేశాలు బట్టబయలయ్యాయి. పోలీసు అధికారి చేతిలో ఉన్న ఆదేశ పత్రాలలోని అక్షరాలు విలేఖరుల కంటికి చిక్కడంతో రహస్య పధకం వెల్లడయింది. ఈక్వడార్ ‘రాజకీయ ఆశ్రయం’ లో రక్షణ పొందుతున్నప్పటికీ ఎట్టి పరిస్ధితుల్లోనూ జూలియన్ ఆసాంజే ను అరెస్టు చెయ్యడానికి బ్రిటన్ నిశ్చయించిందని తెలిసి వచ్చింది. వివిధ దేశాల మధ్య రాయబార సంబంధాల విషయమై కుదిరిన…

ఈక్వడార్ ధిక్కారం, బ్రిటన్ బెదిరింపుల మధ్య అస్సాంజ్ కి రాజకీయ ఆశ్రయం మంజూరు

దక్షిణ అమెరికా దేశం ‘ఈక్వడార్’ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ బెదిరింపులను ఎడమ కాలితో తన్నేస్తూ ‘జూలియన్ అస్సాంజ్’ కు ‘రాజకీయ ఆశ్రయం’ ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వీడన్ లో తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ ను స్వీడన్ కూ, అక్కడి నుండి అమెరికాకు తరలించాలని అమెరికా, యూరప్ దేశాలు పన్నిన కుట్రను భగ్నం చేసే కృషిలో తన వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. గొప్ప ప్రజాస్వామ్య దేశాలం అంటూ తమ జబ్బలు తామే చరుచుకునే…