గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

మరొక పరిమాణాత్మక సడలింపు కార్యక్రమం -ది హిందు

[జనవరి 26 నాటి “Yet another QE programme” సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ********* అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేసిన పరిమాణాత్మక సడలింపు (QE – Quantitative Easing) కార్యక్రమం ఉపసంహరణానంతర పరిణామాలతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వేగుతుండగానే సదరు QE పెద్ద శబ్దంతో మళ్ళీ వచ్చేసింది, ఈ సారి యూరప్ నుండి! గతవారం ప్రకటించబడిన యూరోపియన్ QE ని ముందే ఊహించినప్పటికీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి) ప్రకటించిన భారీ స్ధాయి బాండ్ల కొనుగోలు…

యూరో జోన్ వడ్డీ రేటు ఇప్పుడు 0.05 శాతం

ఐరోపా సంక్షోభ తీవ్రతను తెలియజేస్తూ 17 దేశాల యూరోజోన్ కూటమి వడ్డీ రేటును మళ్ళీ తగ్గించారు. ఆగస్టు ప్రారంభంలో 0.25 శాతం ఉన్న వడ్డీ రేటును 0.15 శాతానికి తగ్గించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఇప్పుడు దానిని కూడా తగ్గించి 0.05 శాతానికి చేర్చింది. ఇంత తక్కువ వడ్డీ రేటు బహుశా ప్రపంచం ఎరిగి ఉండదు. సెంట్రల్ బ్యాంకు/రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గిస్తే ఆ మేరకు బ్యాంకులకు, తద్వారా కంపెనీలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.…

సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాలను చుట్టుముట్టిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఇంకా ఆ దేశాల్ని పీడిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) ప్రకటించిన తాజా ఉద్దీపన చర్యలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సున్న శాతానికి దగ్గరగా ఉన్న వడ్డీ రేటును మరింతగా తగ్గించడం ద్వారా మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించడానికి ఇ.సి.బి నిర్ణయం తీసుకుంది. బహుశా మరే దేశమూ ఇంతవరకు చరిత్రలో ఎరగని చర్యలను కూడా…

బ్యాంకులు కంపెనీల కోసం ఇ.సి.బి ఉదారం, వడ్డీ రేటు 0.75% కి తగ్గింపు

ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారకులయిన బహుళ జాతి వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల కోసం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరోసారి యధా శక్తి ఉదారతను ప్రదర్శించింది. ఇప్పటికే హీన స్ధాయిలో 1 శాతం వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 0.75 శాతానికి చేర్చింది. 2007 ఆర్ధిక సంక్షోభం నుండి అత్యంత తక్కువ స్ధాయి 0.25 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ కంటే ఇది కేవలం అర…

కొత్త సంవత్సరంలో యూరప్ సంక్షోభం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది -యూరప్ సెంట్రల్ బ్యాంక్

యూరప్ రుణ సంక్షోభం కొత్త సంవత్సరంలో తన విశ్వరూప చూపిస్తుందనీ, అది ప్రపంచం అంతా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచం అంతటికీ వ్యాపించడమే కాక సంక్షోభం మరింత తీవ్రం కానున్నదని వారు తెలిపారు. యూరప్ లో సంక్షోభంలో ఉన్న దేశాలకు సహాయ పడే నిమిత్తం ఐ.ఎం.ఎఫ్ కు నిధులు ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించడంతో ఈ పరిస్ధితి తలెత్తుతుందని అధికారులు తెలిపారు. ఐ.ఎం.ఎఫ్ కు బ్రిటన్ ఇరవై…