ఉక్రెయిన్: త్వరలో జెనీవా సమావేశం, పరిష్కారం అనుమానం
ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇరు పక్షాలు చర్చలకు మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. ఉక్రెయిన్ లో తమ తమ ప్రయోజనాలను ఘర్షణలు లేకుండా సంరక్షించుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇ.యు, ఉక్రెయిన్, రష్యాలు సమావేశం అవుతున్నాయి. ఇందులో ఉక్రెయిన్ పాత్ర నామమాత్రం. ఉక్రెయిన్ పాలనను ప్రస్తుతం అదుపులో ఉంచుకున్నది ఇ.యు, అమెరికాలే కనుక ఆ మేరకు పశ్చిమ సామ్రాజ్యవాదులకు సానుకూలత ఏర్పడి ఉంది. అయితే ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో రష్యా భాష మాట్లాడే…