యూరప్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, ముందుంది మొసళ్ళ పండగ

గురువారం అర్ధరాత్రి దాటాక కూడా జరిగిన తీవ్ర చర్చల అనంతరం యూరోప్ దేశాలు తమ రుణ సంక్షోభం పరిష్కారం దిశలో ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. ప్రస్తుత సంక్షోభం గ్రీసు తన రుణాలు చెల్లించలేకపోవడం చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో గ్రీసు రుణంలో కోతకు అంగీకరించినట్లుగా యూరప్ సమావేశం ప్రకటించింది. బుధవారం నుండి జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం గ్రీసు రుణ సంక్షోభమే ప్రధాన ఎజెండగా జరిగింది. అనేక తర్జన భర్జనలు, చర్చోప చర్చల అనంతరం ఒప్పందం…