అమెరికా-తాలిబాన్ చర్చలు, కర్జాయ్ అలక

సెప్టెంబర్ 11, 2001 తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్ల పైన దాడి చేసింది ఒసామా బిన్ లాడేన్ నేతృత్వం లోని ఆల్-ఖైదా యేనని దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్ధాన్ లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. ‘లాడెన్ ని అప్పగించారా సరే సరి, లేదా దాడి చేస్తాం’ అని అధ్యక్షుడు జార్జి బుష్ తాలిబాన్ ని…