ఇస్తాంబుల్ చర్చలు సఫలం, ఆందోళనలో అమెరికా శిబిరం?
మంగళవారం, మార్చి 29, 2022 తేదీన రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని రష్యా ప్రతినిధి బృందం నేత మెడిన్ స్కీ చేసిన ప్రకటనతో స్పష్టం అయింది. ఈ పరిణామం రష్యా శిబిరంలో సంతోషాతిరేకాలు కలిగిస్తుండగా అమెరికా నేతృత్వంలోని పశ్చిమ శిబిరంలో ఆందోళన, అగమ్యం వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చర్చలు సఫలం అయితే పశ్చిమ శిబిరంలోని యూరోపియన్ యూనియన్ కూడా లోలోపల సంతోషిస్తుంది అనడంలో సందేహం లేదు. అమెరికా డిమాండ్, ఒత్తిడిల వల్ల…