ఓ పిరికి హృదయి, ఓ ప్రేమ హృదయాన్ని చంపేసింది -పునర్ముద్రణ

(2013లో సరిగ్గే ఇదే తేదీన ప్రచురించిన ఈ టపాను విషయ ప్రాధాన్యత రిలవెన్స్ రీత్యా పునర్ముదృస్తున్నాను. -విశేఖర్) ********** దివ్య, ఇలవరసన్! కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట భవిష్యత్ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సి ఉండగా కుల రాజకీయాల కోరల్లో చిక్కుకుని అత్యంత ఘోరమైన, క్రూరమైన, దయారహితమైన విషాదాంతం వైపుకి పయనించింది. కుల పార్టీల వలలో చిక్కి, ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్త దగ్గరకు వెళ్ళేది లేదని దివ్య నిర్దయగా ప్రకటించడంతో ఇలవరసన్ రైలు కింద పడి…

ఇళవరసన్ ది ఆత్మహత్యే!

ఇళవరసన్ ఆత్మహత్య చేసుకున్నారని దాదాపు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్ధలంలో ఆత్మహత్య లేక లాంటిదేదీ దొరకలేదని మొదట రైల్వే పోలీసులు చెప్పినప్పటికీ వాస్తవానికి ఆయన లేఖ రాసినట్లు ఆ తర్వాత తెలిసింది. ఇళవరసన్ తన ఆత్మహత్యకు కారణాలు తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖ రాశారని, దానిని తన జీన్ ఫ్యాంట్ జేబులో ఉంచారని తెలుస్తోంది. కానీ రైల్వే పోలీసులు వచ్చే లోపలే ఆ లేఖను సమీప బంధువులు తీసుకోవడంతో లేఖ రాయలేదని పోలీసులు పత్రికలకు తెలిపారు.…

ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు

ధర్మపురిలో రైలు పట్టాలపై శవమై కనిపించిన ఇళవరసన్ ది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ది హిందు పత్రిక ప్రకారం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాల పక్కన శవం కనిపించినట్లుగా ఏ రైలు అధికారీ రికార్డు చేయలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే నిబంధనల ప్రకారం ఒక రైలు ఏ వ్యక్తినైనా ప్రమాదవశాత్తూ ఢీ కొట్టినా లేక ఆత్మహత్య కోసం రైలు ముందుకు దూకినా సదరు రైలు డ్రైవర్ గానీ, గార్డు గానీ లేదా ఇతర…

ధర్మపురి జంటను విడదీశారు

తమిళనాడులో కులాంతర వివాహాలపై విషం కక్కుతున్న స్వార్ధ శక్తులు ఒక ఆదర్శ వివాహ జంటను విడదీయడంలో ఎట్టకేలకు సఫలం అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితులపై విష ప్రచారానికి వెనుకాడని పట్టళి ముక్కల్ కచ్చి (పి.ఎం.కె) పార్టీ నాయకులు ఆ పాపం మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. వన్నియార్ కుల ప్రజలను దళితులపై విద్వేషపూరితంగా రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించడానికి అలవాటు పడిన పి.ఎం.కె నాయకుడు రాందాస్ అనేక సంవత్సరాలుగా కులాంతర వివాహాలను పచ్చిగా వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. మరీ…