రష్యా ఆంక్షలు: ఇష్టం లేకుండానే ట్రంప్ సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పినట్లుగానే రష్యా వ్యతిరేక ఆంక్షల బిల్లుపై సంతకం చేశాడు. బిల్లు ఆమోదం తనకు ఇష్టం లేదని చెప్పి మరీ సంతకం చేశాడు. సంతకం చేసిన వెంటనే బిల్లుని ప్రవేశపెట్టినందుకు హౌస్, సెనేట్ లపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. రష్యా-ఉత్తర కొరియా-ఇరాన్ వ్యతిరేక ఆంక్షల బిల్లు అమెరికా పాలనా వ్యవస్ధ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఉన్న విభేదాలని మరోసారి బహిర్గతం చేసింది. ప్రభుత్వాధికారంపై పట్టు కోసం అమెరికా…

చమురు ఉత్పత్తి: సౌదీని అధిగమించిన రష్యా

చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా దేశానిదే అగ్రస్ధానం. అమెరికా అండతో, అవసరం అయితే బలవంతంగానైనా కాంట్రాక్టులు సంపాదించే సౌదీ అరేబియా అత్యధిక చమురు ఉత్పత్తి దేశంగా స్ధానం సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. మారిన అంతర్జాతీయ పరిస్ధితుల్లో సౌదీ తన స్ధానాన్ని రష్యాకు కోల్పోతుందని విశ్లేషకులు గత కొంత కాలంగా అంచనా వేస్తున్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ  డిసెంబర్ నెలలో చమురు ఉత్పత్తిలో రష్యా దేశం సౌదీ అరేబియాను అధిగమించింది రియాద్ లోని జాయింట్ ఆర్గనైజేషన్స్ డేటా…

షియా ఇరాన్ సందర్శనలో సున్నీ కువైట్ అమీర్

మధ్య ప్రాచ్యంలో మరో పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు పక్కా మిత్ర దేశం కువైట్ అమీర్ ఒకరు ఆదివారం నుండి తన ఇరాన్ సందర్శన ప్రారంభించాడు. షియా ఇరాన్ ప్రభావం మధ్య ప్రాచ్యంలో పెరిగడానికి దారి తీసే ప్రతి పరిణామాన్ని ఆటంకపరిచే సున్నీ సౌదీ అరేబియా పాత్ర ప్రస్తుత పరిణామంలో ఎంత ఉందన్నది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. గత సంవత్సరం అధికారం చేపట్టిన రౌహాని ప్రభుత్వం అమెరికా, పశ్చిమ రాజ్యాలతో పాటు ప్రాంతీయ ప్రత్యర్ధి…

లెబనాన్: ఆత్మాహుతి దాడిలో ఇరాన్ రాయబారి దుర్మణం

లెబనాన్ రాజధాని బీరుట్ ను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. నిత్యం రగులుతున్న పొయ్యి పైన ఉడుకుతున్నట్లు ఉండే మధ్య ప్రాచ్యంలో, అందునా బీరుట్ లో బాంబు పేలుళ్లు కొత్తకాకపోయినా ఒక దేశ రాయబారి మరణించడం మాత్రం తీవ్ర పరిణామమే. 23 మంది మరణానికి, మరో 146 మంది గాయపడడానికి దారి తీసిన పేలుళ్లకు ఆత్మాహుతి దాడి కారణమని రష్యా టుడే తెలిపింది. పేలుళ్లకు తామే బాధ్యులమని ఒక ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ ప్రకటించింది. అయితే ఇరాన్, సిరియాలు…

ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు

ఈ ఇరానియన్ తల్లి, కూతుళ్ల దుఃఖానికి ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే వారు అనుభవిస్తున్న వేదన అంతా ఒక్క ముక్కలో అర్ధం అవుతుంది? పోనీ ఎన్ని పదాలు కలిపి ప్రయోగిస్తే వారి నిరామయ దుఃఖ సారం నిండుగా వ్యక్తీకరించబడుతుంది? ఎన్ని రాత్రుళ్లు, పగళ్ళు పొగిలి పొగిలి ఏడ్చితే తీరే దుఃఖం వీరిది! ఆమె పేరు సొమాయే మెహ్రి. వయసు 29. ఆమెతో ఉన్నది మూడేళ్ల కూతురు రానా. సొమాయే భర్త అమీర్ అఫ్ఘనిపూర్ అకృత్యానికి…

ఢిల్లీ, జార్జియా, ధాయిలాండ్ పేలుళ్ల వెనక ఇరానియన్లు

సోమవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి సమీపంలో ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని లక్ష్యం చేసుకుంటూ జరిగిన బాంబు పేలుడుకూ, దాదాపు అదే సమయంలో జార్జియా లోనూ మంగళవారం ధాయిలాండ్ లోనూ జరిగిన బాంబు పేలుళ్లకూ దగ్గరి సంభంధం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఆమోదించడం గానీ, నిరాకరించడం గానీ చేయబోవడం లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలను అనేక మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పొట్టన బెట్టుకున్నట్లుగా ఇరాన్ గతంలో ఆరోపించింది.…