రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక…

అమెరికా యుద్ధ నౌకల్ని మేం ఫోటోలు తీశాం -ఇరాన్

ఇరాన్ గూఢచార విమానాలు అమెరికా యుద్ధ నౌకాలను ఫోటోలు తీశాయని ఇరాన్ మిలట్రీ కమాండర్ ప్రకటించాడు. పర్షియా ఆఘాతంలో తిష్ట వేసి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకతో పాటు ఇతర యుద్ధ విమానాలను, తమ మానవ రహిత డ్రోన్ లు ఆకాశం నుండి ఫోటోలు తీసాయని బ్రిగేడియర్ జనరల్ ఫర్జాడ్ ఎస్మాయిల్ మంగళవారం ప్రకటించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. ఇరాన్ గగన తాళంలోకి జొరబడి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా డ్రోన్ విమానాన్ని గత…

War-Drums

(ఇరాన్) వార్ డ్రమ్స్ -కార్టూన్

వియత్నాంలో పరాభవం ఎదురైంది. ఇరాక్ లో చావు తప్పి కన్ను లొట్టబోయింది. వెనిజులాలో తరిమి తరిమి కొట్టారు. బొలీవియా ‘ఛీ ఫో’ అంటోంది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉతికి ఆరేస్తున్నారు. సిరియా ప్రజల్లో వినేవాడే లేడు. అయినా అమెరికా పాలకులకి సిగ్గూ లజ్జా లేకుండా పోయాయి. ఇరాన్ పై దురాక్రమణ దాడికి ‘వార్ డ్రమ్స్’ మోగిస్తోంది. – –

అజరబైజాన్ ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం లీక్ చేసిన అమెరికా

తన ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలు అభివృద్ధి కావడం ఇష్టం అమెరికాకి ఇష్టం లేకపోవడమే, అజరబైజాన్ తో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని లీక్ చేయడానికి కారణం అని రష్యా టైమ్స్ పత్రిక తెలిపింది. ఇరాన్ అణు కర్మాగారాలపై బాంబులు వేసి ధ్వంసం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ ఉత్సాహం తన పుట్టి పుంచుతుందని అమెరికాకి భయం. దురాక్రమణ యుద్ధాలు, ప్రభుత్వాల కూల్చివేతలు అమెరికాకి కొత్తేమీ కాదు. కాకపోతే కాస్త సమయం తీసుకుందామన్నదే అమెరికా అభిప్రాయం. ఇజ్రాయెల్…

అజర్ బైజాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ పై దాడి చేయనున్న ఇజ్రాయెల్?

వైమానిక బాంబుదాడులతో ఇరాన్ అణు కర్మాగారాలను నాశనం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ కు తమ ఎయిర్ బేస్ లు వినియోగించుకోవడానికి అజర్ బైజాన్ అంగీకరించినట్లు అమెరికాకి చెందిన ‘ఫారెన్ పాలసీ’ పత్రిక వెల్లడించింది. ఈ వార్తలను అజర్ బైజాన్ ప్రబుత్వం ఆగ్రహంగా తిరస్కరించింది. “ఇజ్రాయెల్ ఒక ఎయిర్ ఫీల్డ్ కొనుక్కుంది. ఆ ఎయిర్ ఫీల్డ్ పేరు అజర్ బైజాన్” అని ఒక అమెరికా అధికారి చెప్పినట్లుగా ఫారెన్ పాలసీ పత్రిక చెబుతోంది. అజ్ఞాత సీనియర్ రాయబారులనూ, ఆర్మీ…