భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

ఇరాన్ మందులు అమెరికాకి రక్ష, అమెరికా ఆంక్షలు ఇరాన్ కి శిక్ష

ఇరాన్ తయారు చేసిన ఔషధాలు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను కాపాడుతుంటే, అమెరికా ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు లక్షలాది ఇరానియన్ రోగులను చంపేస్తున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో పాము కాటుకి గురయిన అమెరికా సైనికులకి ఇరాన్ తయారు చేసిన విరుగుడు ఔషధాలు తప్ప మరో గతి లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఆదివారం ప్రచురించిన ఒక రిపోర్ట్ లో పత్రిక ఈ సంగతి తెలిపింది. నైరుతి ఆసియా ప్రాంతానికి ప్రత్యేకమైన పాముల కాట్లకు గురవుతున్న అమెరికా…

ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …