బద్ధ శత్రు దేశాలకు ఇరాన్ స్నేహ హస్తం

ఇరాన్ తన బద్ధ శత్రు దేశాలకు కూడా స్నేహ హస్తం చాస్తోంది. P5+1 దేశాలతో తాత్కాలిక ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ విదేశీ మంత్రి మహమ్మద్ జవద్ జరీఫ్ మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రత్యర్ధి దేశాలతో సంబంధాలను బాగు చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా సున్నీ ముస్లిం మత దేశాలలో ఆయన పర్యటిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో మతపరంగానూ, చమురు వాణిజ్య ప్రయోజనాలపరంగానూ తమకు ప్రధాన ప్రత్యర్ధి సౌదీ అరేబియా కు సైతం జారీఫ్ ప్రయాణం చేయడం…

P5+1 – ఇరాన్ ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం

ఇరాన్, P5+1 దేశాల మధ్య ఇరాన్ లో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర స్ధాయిలో సాగించిన లాబీయింగు విఫలం అయింది. ఒప్పందం ఫలితంగా ఇరాన్, 20 శాతం మేర యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిలిపేస్తుంది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ పై విధించిన వాణిజ్య ఆంక్షలను 6 నెలల పాటు పాక్షికంగా ఎత్తేస్తారు. ఇది తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగడానికి తగిన భూమిక ఏర్పడడానికి…

పీస్ పైప్ లైన్ పై వేలాడుతున్న అమెరికా ఆంక్షల కత్తి

అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతుండడంతో పాకిస్ధాన్-ఇరాన్ పీస్ పైప్ లైన్, నిధుల లేమితో సతమతమవుతోంది. ఇరాన్ సహజ వాయు నిక్షేపాలతో పాక్ ప్రజల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ పైప్ లైన్ తలపెట్టి దశాబ్దం దాటిపోయింది. పాకిస్ధాన్ మీదుగా ఇండియాకి కూడా గ్యాస్ సరఫరా చేయడానికి పీస్ పైప్ లైన్ ను మొదట ఉద్దేశించారు. కానీ అమెరికా బెదిరింపులతో ఇండియా ఈ ప్రాజెక్టును వదులుకుంది. పాకిస్ధాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను త్రోసిరాజని ముందుకు వెళుతోంది. గత మార్చి…