రాంకుమార్ ఆత్మహత్య(?)తో స్వాతి హత్య ఇక మిస్టరీ!
రాం కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, కాదు… ఆత్మహత్య చేసుకున్నాడని పూళల్ సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నారు. ప్రాణాధికంగా ప్రేమించిన యువతి తన రూపాన్ని అపహాస్యం చేయడం సహించలేక హంతకుడిగా మారిన భగ్న ప్రేమికుడు రాం కుమార్ తన వాస్తవ ప్రేమ కధ ఏమిటో లోకానికి తెలియకుండానే భూమిపైన నూకలు చెల్లించుకున్నాడు. జైలులోని డిస్పెన్సరీలో ఉండగా రాం కుమార్ అక్కడి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు నుండి విద్యుత్ ప్రవహిస్తున్న తీగను బైటికి లాగి నోటితో కరిచి…