స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక
ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన…