ఇటలెగ్జిట్ తప్పదా?

యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెగ్జిట్ అన్నారు. అలాగే యూరో జోన్ నుండి ఇటలీ బైటికి వెళ్లడాన్ని ఇటలెగ్జిట్ అంటున్నారు. ఇటలీ ఋణ భారం పెరగడమే తప్ప తగ్గే జాడ కనిపించడం లేదు. దానితో ఉమ్మడి కరెన్సీ యూరోను త్యజించి తన జాతీయ కరెన్సీని మళ్ళీ అమలు చేయాలన్న వాదనకు ఇటలీలో మద్దతు పెరుగుతోంది. బ్రిటన్ యూరో జోన్ లో సభ్యురాలు కాదు. అంటే బ్రిటన్ ఉమ్మడి కరెన్సీ యూరో ను తమ కరెన్సీగా…