‘పొదుపు విధానాల’ పై ఇటాలియన్ల సమ్మె
ఇటలీ నగరంలో పొదుపు విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్యార్ధులపైన పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. దక్షిణ ఇటలీ నగరం నేపుల్స్ లో పోలీసులు, ప్రజల ఘర్షణలు తీవ్ర స్ధాయిలో జరిగాయని ప్రెస్ టి.వి తెలిపింది. ప్రభుత్వ పన్నుల విధానాలతో ఆగ్రహం చెందిన కార్మికులు, విద్యార్ధులు పన్నుల కార్యాలాయం ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ప్రదర్శకులను తరిమివేయడానికి ప్రయత్నించడంతో ప్రదర్శకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దానితో విద్యార్ధులు కార్మికులు పోలీసులపై బాటిళ్ళు, కోడిగుడ్లు విసిరారని పత్రికలు…