అగస్టా ఛాపర్: సోనియాను ఇరికించే మాయోపాయం?

4 రాష్ట్రాల ఎన్నికలు జనానికి ముఖ్యంగా పత్రికల పాఠకులకు, చానెళ్ల వీక్షకులకు గడ్డు రోజులు తెచ్చి పెట్టాయి. ఎన్నికల ప్రచారం అంటే ప్రజలు తమ ఎంపిక కోసం తమ ముందు ఏ యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం. ఇలాంటి అవకాశాలను ప్రజల ముందు ఉంచే పంధా నుండి రాజకీయ పార్టీలు ఎప్పుడో తప్పుకోవడం ఎన్నికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అదనపు సమస్య. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో వారి చేతుల్లో ఉన్న ఒక ప్రధాన…

మావాళ్లని విడిపించండి -ఐరాసకు ఇటలీ మొర

ఇండియాకు వ్యతిరేకంగా ఇటలీ తొక్కని గడప లేదు. ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటలీ మెరైన్ల కేసులో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కు మొర పెట్టుకున్న ఇటలీ తాజాగా ఐక్యరాజ్యసమితి గడప తొక్కింది. భారత దేశం బందిఖానా నుండి తమ మెరైన్లను మీరయినా విడిపించాలని ఐరాసను కోరింది. “మెరైన్లను ఇటలీలో విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ లోగా వారికి (భారత దేశం నుండి) విముక్తి కావాలి” అని ఇటలీ…

ఇటలీ మెరైన్ కేసు: ఇండియా వెనకడుగు?

ఇటలీ, ఇ.యు ల నుండి వచ్చిన ఒత్తిడికి భారత ప్రభుత్వం తల వంచినట్లు కనిపిస్తోంది. పైరసీ చట్టాన్ని ప్రయోగించడం లేదని కేంద్రం ఈ రోజు సుప్రీం కోర్టుకు తెలిపింది. యాంటీ-పైరసీ యాక్ట్ (సముద్ర దోపిడి వ్యతిరేక చట్టం) ప్రకారం తమ మెరైన్ సైనికులను విచారించడానికి ఇండియా సిద్ధపడడం పట్ల ఇటలీతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాను అనుకున్నట్లుగా ఇండియా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని, తగిన ప్రతిస్పందన ఖాయం…

ఇండియాపై ఐరాసకు ఇటలీ ఫిర్యాదు

ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ…

పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి

కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ మెరైన్లను పైరసీ వ్యతిరేక చట్టం కింద విచారించడానికి భారత హోమ్ శాఖ అనుమతి ఇవ్వడంపై ఇటలీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఇటలీ విదేశీ మంత్రి ఆదివారం ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించగా సోమవారం ఇ.యు కూడా దాదాపు అదే తరహాలో హెచ్చరించింది. ఇటలీ మెరైన్లను అన్యాయంగా విచారిస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ఇటలీ, ఇ.యులు అల్టిమేటం జారీ చేశాయి. “మా మెరైన్లకు వ్యతిరేకంగా జరగబోయే లీగల్…