ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ

దేశంలో జరుగుతున్న ప్రజాందోళనలను అణచివేయడానికి సైన్యాన్ని దించక తప్పదని ఇటలీ ప్రధాని ‘మేరియో మోంటి’ ప్రకటించాడు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ఇటలీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల ఒత్తిడితో యూరోపియన్ దేశాలు పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయి సామాజిక సమస్యలు తీవ్రం అయ్యాయి. వినాశకర ఆర్ధిక విధానాలు అమలు చేయడం ఆపాలని ప్రజలు కోరుతుండగా వారి మొర ఆలకింకడానికి…

ప్రమాద దశకు యూరప్ అప్పు సంక్షోభం, ఇటలి అప్పు సంక్షోభంపై ఎమర్జెన్సీ సమావేశం?

యూరప్ అప్పు సంక్షోభం ప్రమాద దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న ఇటలీ అప్పు గురించి చర్చించడానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ సోమవారం ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. రోంపి ప్రతినిధి సోమవారం నాటి సమావేశంలో ఇటలి గురించి చర్చించడం లేదని చెబుతున్నప్పటికీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఇద్దరు ఇటలీ గురించి చర్చించడానికే సమావేశమని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా…