ఆఫ్ఘన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జర్మన్ల ప్రదర్శన
ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాదిమంది జర్మన్లు శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జర్మనీ వ్యాపితంగా ఉన్న డెబ్బై పైగా నగరాలలో పదుల వేలమంది జర్మన్లు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని ప్రెస్ టి.వి. తెలిపింది. సాంప్రదాయక ఈస్టర్ ‘పీస్ మార్చ్’ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో, ప్రదర్శకులు నాటో దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. రాజధాని బెర్లిన్ లో అమెరికా ఎంబసీ ముందు వందలమంది నిరసనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్ధాన్ లోనూ, పశ్చిమాసియాలోనూ అమెరికా అనుసరిస్తున్న…