లండన్: ఇజ్రాయెల్ వ్యతిరేక భారీ ప్రదర్శనలు
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత. ఈ సామెత తమ విషయంలో నిజం కాదని లండనర్లు నిరూపిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటిష్ పత్రికలు అంతా కట్టగట్టుకుని ఇజ్రాయెల్ స్వయం రక్షణ హక్కు కోసం పాటు పడుతుంటే, ఇజ్రాయెల్ అమానవీయ దాడులు జరిపే హక్కులను నిలదీస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లండనర్ల నిరసనలను లండన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ‘పాలస్తీనియన్ సాలిడారిటీ కాంపెయిన్’, ‘స్టాప్…