ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్ మెంట్ల పై విచారణ చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఆమోదించింది. ఒక్క అమెరికా తప్ప ఇతర సభ్యులందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్ లో పాల్గొనకపోవడమో చేశారు. ఇజ్రాయెల్ సాగించే అక్రమ వలస పాలనకూ, పాలస్తీనీయులపై అది సాగించే దౌర్జన్యాలకూ నిరంతరం వత్తాసు వచ్చే అమెరికా, మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్ష పాతంగా కూడి ఉందని…

టర్కీ ప్రధాని ‘ఎర్డోగాన్’ ద్విపాత్రాభినయం

టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈయన 2003 నుండి ప్రధానిగా అధికారంలో ఉన్నాడు. మూడోసారి కొంత మెజారిటీ తగ్గినా ప్రభుత్వం ఏర్పరచడానికి తగిన మెజారిటీ సంపాదించగలిగాడు. రెండో సారి అధికారానికి వచ్చినప్పటినుండి ఈయన పాలస్తీనా స్వతంత్రానికి మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ కి కోపం వచ్చే మాటలు మాట్లాడుతూ పశ్చిమాసియాలో ముస్లింల ప్రయోజనాలు కాపాడే ఛాంపియన్ గా టర్కీని నిలపడానికి బాగా ప్రయత్నిస్తూ వచ్చాడు. పశ్చిమాసియాలో ప్రాంతీయంగా ఇరాన్ తో పోటీపడి…

ఇజ్రాయెల్ ఉక్కుపాదాన్ని గేలి చేస్తూ పాలస్తీనీయుల స్వాతంత్ర్య పిపాస -వీడియోలు

అమెరికా, ఇంగ్లండుల అండతో పాలస్తీనా భూభాగాన్ని చెరబట్టిన ఇజ్రాయెల్ ఆక్రమణని నిరసిస్తూ, 63 ఏళ పాశవిక నిర్బంధాన్నీ, పశు ప్రవృత్తితో సమానమైన ‘యూదు జాత్యహంకారాన్ని’ ఎదిరిస్తూ వేల మంది పాలస్తీనీయులు మే 15 తేదీన ఇజ్రాయెల్ లోని జాఫా పట్టణంలో ఉద్రిక్తల నడుమ నక్బా (వినాశన దినం – పాలస్తీనీయుల భూభాగంపై ఇజ్రాయెల్‌ని సృష్టించిన రోజు) ని పాటించారు. రోమాంఛితమైన ఆ ఘటనను చిత్రించినప్పటి వీడియోలే ఇవి. ప్రదర్శనలో పాల్గొన్న ఓ కార్యకర్త ఒమర్ సిక్సిక్ ప్రకటన:…

“వినాశన దినం” (నక్బా) నాడు పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ సైనికుల ఘర్షణ -రాయిటర్స్ ఫొటోలు

పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ దేశాన్ని స్దాపించాయి. లక్షలమంది పాలస్తీనీయులను వారి ఇళ్ళనుండి భూములనుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. వారికి పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనాన్, జోర్డాన్ లలో శరణార్ధులుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించి అక్కడి పాలస్తీనియులను వెళ్ళగొట్టి సెటిల్‌మెంట్లను ఇప్పటికీ…

పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…