అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం
“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…