ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!

జపాన్ తన మిలటరీ విధానాన్ని మార్చుకుంటున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి, అణు బాంబు విధ్వంసం దరిమిలా జపాన్, ‘కేవలం ఆత్మరక్షణకే మిలటరీ’ అన్న విధానంతో తనకు తాను పరిమితులు విధించుకుంది. ఇప్పుడు ఆ విధానానికి చరమగీతం పాడుతోంది. తన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే జపాన్ మిలటరీ బడ్జెట్ ఇక నుండి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరగనుంది. జపాన్ అంతటితో ఆగటం లేదు. వివిధ దేశాలతో వరస…

ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3

    నాటోకు కాల దోషం? అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ…

ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి

  2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు…