2+2 ఫార్మాట్ చర్చలు అంటే?

భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది.…

ఇండియా రష్యా 2+2 డైలాగ్: ఏ‌కే-203 ఒప్పందం ఒకే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య 2+2 ఫార్మాట్ లో ఈ రోజు చర్చలు జరిగాయి. చర్చల్లో రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు, విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ లు రష్యా తరపున పాల్గొనగా, ఇండియా తరపున రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ లు పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఈ సమావేశం ఇండియా రష్యాల మధ్య 2+2 ఫార్మాట్ లో…

ఇండియాలో పుటిన్: చమురు, అణు ఒప్పందాలతో సందడి

రష్యా అధ్యక్షుడు పుటిన్ ఒక రోజు ఇండియా సందర్శన రష్యాకు ఫలప్రదంగా ముగిసింది. డజను అణు రియాక్టర్ల నిర్మాణం, చమురు సరఫరా ఒప్పందం, మిలట్రీ సరఫరా ఒప్పందాలతో పుటిన్ కడుపు నింపుకుని సంతృప్తిగా వెళ్లారు. అమెరికా తన షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తిని తీవ్రం చేయడం ద్వారా అంతర్జాతీయ రేట్లను కిందికి నెట్టడంతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ కష్టాల్లో పడిన సందర్భంలో ఇండియాతో చేసుకున్న ఒప్పందాలు రష్యాకు మేలు చేస్తాయి. ఇండియాకు మాత్రం అనుత్పాదక వ్యయాన్ని పెంచుకోవడం…