ఇండియా-పాక్ సరిహద్దు కాల్పులు -పాక్ కళ్ళతో

ఇండియా, పాకిస్ధాన్ సరిహద్దులో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తన ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించిన భారత ప్రధాని నరేంద్ర మోడి క్రమక్రమంగా పాక్ చర్చలకు దూరం జరుగుతూ వచ్చారు. ఇందుకు కారణం మీరంటే మీరే అని ఇరు దేశాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిర్వహించిన ఆందోళనల ఫలితంగా పాక్ విదేశీ విధానం, ముఖ్యంగా ఇండియా విధానం నవాజ్ చేతుల్లో నుండి పాక్…

హాకీ ప్రత్యర్థి పాక్ ఐతే మన టీం సభ్యులు డజను -కార్టూన్

హాకీ ఆటలో ఒక్కో టీం లో ఎంతమంది సభ్యులు ఉంటారు? లెక్క ప్రకారం అయితే 11 మంది. భారత్ ప్రత్యర్థి పాకిస్ధాన్ ఐతే మాత్రం మనవాళ్లు 12 మంది ఆడుతారు. ఫీల్డ్ లో ఆడేది 11 మందే అయినా భారత టీం లో మరో అదృశ్య ప్లేయర్ తప్పనిసరిగా ఉంటారు. వారే మన విదేశాంగ శాఖ (Ministry of External Affairs – MEA). ఆటను ఆటగా ఉండనిస్తేనే అందం. ఆటలో ప్రభుత్వాలు, వారి తరపున రాజకీయ…

పాకిస్ధాన్‌కి అమెరికా మిలట్రీ సాయాన్ని మళ్ళీ విమర్శించిన ఇండియా

అమెరికా, పాకిస్ధాన్‌కి బిలియన్లకొద్దీ మిలట్రీ సహాయం ఇవ్వడాన్నీ భారత దేశం మరొకసారి విమర్శించింది. అమెరికా, ఇండియాల సంబధాల మధ్య ఈ అంశం మొదటినుండీ ఒక చికాకు గా ఉంటూ వచ్చింది. పాకిస్ధాన్‌కి అందిస్తున్న మిలట్రీ సహాయంలో చాలా భాగం ఇండియాకి వ్యతిరేకంగా రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తోందని భారత ఆరోపిస్తున్నది. న్యూయార్కు నగరంలోని జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగినప్పటినుండీ టెర్రరిజంపై పోరాటంలో సహకరిస్తున్నందుకు అమెరికా, పాకిస్ధాన్‌కి 20.7 మిలియన్ డాలర్లను (రు. 95220 కోట్లు) సహాయంగా…

అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?

జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు”…

అమెరికాతో చెడిన నేపధ్యంలో చైనా కార్డుని ముందుకి తెస్తున్న పాకిస్ధాన్

ఒసామా బిన్ లాడెన్ ని హత్య చేయకముందు వరకూ ఏడు సంవత్సరాలనుండి అబ్బోత్తాబాద్ లోనే ఉంటున్నామని ఆయన భార్య చెప్పిన నేపధ్యంలో లాడెన్‌ని దాచిపెట్టడంలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఇంతకాలం లాడెన్ పాక్‌లో దాగి ఉండటం పాక్‌లోని కనీసం కొందరి అధికారులకైనా తెలియకుండా సాద్యం కాదని అమెరికా ప్రతినిధుల సభ అనుమానాలు వ్యక్తం చేసింది. పాక్‌కి అందిస్తున్న బిలియన్ డాలర్ల సహాయాన్ని రద్దు చేయాలని…