ఇండియాతో చర్చలు: మండుతున్న పాకిస్ధాన్ -కార్టూన్

“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…” *** ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి…

ఒక చికాకుపై అతి స్పందన -ది హిందు ఎడిటోరియల్

(ఆగస్టు 25 తేదీన ఇండియా, పాకిస్ధాన్ ల విదేశాంగ శాఖల కార్యదర్శులు సమావేశమై చర్చలు జరపవలసి ఉంది. దానికంటే ముందు ఇండియాలోని పాక్ హై కమిషనర్ కాశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులకు ఆహ్వానాలు పంపారు. కొందరు హురియత్ నాయకులు వెళ్ళి మాట్లాడారు కూడా. దీనిని కారణంగా చూపిస్తూ మోడి ప్రభుత్వం కార్యదర్శి స్ధాయి చర్చలను రద్దు చేసింది. ఈ అంశంపై ఈరోజు (ఆగస్టు 20, 2014) ది హిందు పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.…

పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది.…

పాక్ ఉల్లంఘన కూడా చర్చిస్తార్ట!

త్వరలో జరగబోయే పాక్-భారత్ చర్చల్లో పాకిస్ధాన్ ఒప్పందం ఉల్లంఘన గురించి కూడా చర్చిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్ధాన్ తో చర్చలు అంటేనే అంతెత్తున ఎగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే సో కాల్డ్ సెక్యులరిజాన్ని బూటకపు సెక్యులరిజంగా తిట్టిపోసే బి.జె.పి నేతలు ఇప్పుడు అదే పాకిస్ధాన్ తో చర్చలు చేయబోతున్నారు. చర్చలు జరపడమే ఆశ్చర్యం అనుకుంటే గత కొంత కాలంగా పాకిస్ధాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను కూడా చర్చిస్తామని చెప్పడాన్ని…

సరిహద్దులో భారత్ హెలికాప్టర్ ను బలవంతంగా దింపిన పాకిస్ధాన్ ఫైటర్ జెట్లు

భారత హెలికాప్టర్ ఒకటి పాకిస్ధాన్ గగనతలంలోకి చొరబడడంతో పాకిస్ధాన్ మిలట్రీకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు దానిని బలవంతంగా కిందికి దింపాయి. హెలికాప్టర్ లో నలుగుతు భారత్ మిలట్రీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ గగనతలంలోకి జరిగిన చొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదనీ, దట్టంగా మంచు కమ్మడంతో జరిగిందనీ భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నలుగురు అధికారులు ప్రస్తుతం పాకిస్ధాన్ కస్టడీలో ఉన్నారు. నలుగురు క్షేమంగా ఉన్నారని పాకిస్ధాన్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట…