పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…

కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే.…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి వ్యతిరేకత ఉత్తుత్తిదే -అద్వానీ (వికీలీక్స్)

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో అమెరికా ఇండియా లమధ్య కుదిరిన అణు ఒప్పందం పై బిజేపి తెలిపిన వ్యతిరేకత నిజానికి ఉత్తుత్తిదే అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఎల్.కె.అద్వానీ అమెరికా రాయబారికి చెప్పిన విషయం వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటికి కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. 2009 పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఫలితాలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అమెరికా రాయబారి కార్యాలయం చార్జి డి’ ఎఫైర్స్ పీటర్ బర్లే (రాయబార కార్యాలయంలో ముగ్గురు ముఖ్య రాయబారులు ఉంటారు…