పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…