పోలీస్ లాకప్ లోనే కొట్టాం! -స్టింగ్ వీడియో

ఇండియా టుడే చానెల్ మరో సంచలనానికి తెర తీసింది. ఢిల్లీ పోలీసులు చేయడానికి ఇష్టపడని పరిశోధనని తాను చేసి చూపెట్టింది. చిన్న గొడవగా లాయర్ల హింసను కొట్టిపారవేస్తూ వారిపై పెట్టీ కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసుల నేరపూరిత కుమ్మక్కును ఎండగడుతూ మరో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి పధకం ప్రకారమే విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరులపై లాయర్లు దాడి చేసి కొట్టారని బయట పెట్టింది. ఇండియా టుడేకు చెందిన ఇద్దరు విలేఖరులు విక్రమ్ చౌహాన్, ఓం శర్మ, యశ్…

కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో

కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్, రామ నామ, అశుతోష్ మరో ఇద్దరు జే‌ఎన్‌యూ విద్యార్ధులు ఫిబ్రవరి 9 తేదీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి, బి‌జే‌పి అధ్యక్షుడు, ఇతర కేంద్ర మంత్రులు, బి‌జే‌పి నేతలు, ఎం‌పిలు, ఎం‌ఎల్‌ఏలు ఏకబిగిన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల్ని పురమాయించి దేశద్రోహం కేసు కూడా విద్యార్ధులపై బనాయించారు. కన్హైయాను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తుంటే హిందూత్వ లాయర్ గూండాలు ఆయన్ని కొట్టారు. కోర్టుకు వచ్చిన…