కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే -జపాన్ లో ప్రధాని

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. భారత దేశంలో ప్రజలకు హామీలు ఇచ్చే అవకాశం ఎన్నడూ రాని ఆయన (ఎన్నికల్లో పోటీ చేయరు గనుక) దానిని జపాన్ లో దొరకబుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అడిగిందే తడవుగా జపాన్ పారిశ్రామిక వేత్తలకు హామీలు ఇచ్చేశారు ప్రధాని మన్మోహన్ సింగ్. ‘కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే’ అంటూ పరమానంద రాగం ఆలపించినంత పని చేశారు. ‘మీ మార్కెట్లు ఇంకా బాగా తెరవాలి’ అంటే ‘దాందేముంది, మా ప్రజలకు…