చర్చల వైఫల్యానికే పఠాన్ కోట్ దాడి -చైనా
భారత్-పాక్ చర్చలకు అనుకోనివైపు నుండి మద్దతు లభించింది. బ్రిక్స్ కూటమిలో ప్రధాన దేశమైన చైనా పఠాన్ కోట్ దాడిపై స్పందించింది. పఠాన్ కోట్ లోని భారత సైనిక వైమానిక స్ధావరంపై జరిగిన ఉగ్రవాద దాడి పొరుగు దేశాల మధ్య జరగనున్న చర్చలను చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చైనా వ్యాఖ్యానించింది. పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాద దాడిని చైనా ప్రభుత్వ ప్రతినిధి హువా చున్ యింగ్ ఖండించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న…