అరుణాచల్ సరిహద్దు: దలైలామా పాచిక విసిరిన అమెరికా?

ఇండియా, చైనా సరిహద్దు సమస్య పరిష్కారం ముంగిట ఉన్నదని చైనా ప్రకటించిన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య దలైలామా సందర్శన విషయమై ఘర్షణ చెలరేగడం కాకతాళీయమా లేక పధకం ప్రకారం జరిగిందా? ఇండియా, చైనాల మధ్య సరిహద్దు సమస్య శాంతియుతంగా, ఎవరి జోక్యం లేకుండా… ముఖ్యంగా అమెరికా, పశ్చిమ రాజ్యాల జోక్యం లేకుండా పరిష్కారం కావడం ఇష్టం లేకనే అర్జెంటుగా దలైలామా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సందర్శనకు పధకం రచించబడిందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.…

ఇండియా-చైనా యుద్ధం: మిలట్రీ చర్యపై ముందే హెచ్చరించిన చైనా

ఈ అక్టోబర్ 20 తేదీతో చైనా-ఇండియాల యుద్ధం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలపై పత్రికలు తాజా విశ్లేషణలకు పూనుకుంటున్నాయి. టి.వి చానెళ్లు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తున్నాయి. చైనా ముందస్తు హెచ్చరిక లేకుండా ఇండియాపై దాడి చేసిందన్నది ఈ విశ్లేషణలు, ప్రత్యేక కధనాల సారాంశంగా ఉన్నది. అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావో జెడాంగ్ ఆదేశాలతోనే చైనా ఇండియాపై దురహంకార దాడికి దిగిందని నిన్న…

చైనా, ఇండియాపై దాడి చేస్తుందని ప్రభుత్వం భావించడం లేదు -ప్రధాని

భారత దేశంపై దాడి చేయడానికి చైనా పధకం వేస్తోందన్న వాదనను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం చెప్పాడు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఇరు దేశాల అభిప్రాయం అని ఆయన అన్నాడు. ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఇండియా, చైనా సరిహద్దులు మొత్తం మీద ప్రశాంతంగానే ఉన్నాయని లోక్ సభ సభ్యులకు తెలిపాడని ‘ది హిందూ’ తెలిపింది. “చైనా, ఇండియాపై దాడి చేయడానికి పధకం వేస్తోందన్న భావనను ఇండియా అంగీకరించడం లేదు” అని…