హై అలర్ట్: ఆల్-ఖైదాకు వ్యతిరేకం కాదు అనుకూలం -నిపుణులు

ఆల్-ఖైదా నేతగా చెబుతున్న అయిమన్ ఆల్-జవహిరి వీడియో వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్ధితిని సమీక్షించి, భద్రతా సంస్ధలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను నిపుణులు విమర్శిస్తున్నారు. ‘హై అలర్ట్’ అంటూ ప్రకటించిన అప్రమత్తత చివరికి మైనారిటీ ప్రజలను పోలీసులు, ఇతర బలగాలు వేధింపులకు గురిచేసి భారత ప్రధాన స్రవంతి నుండి దూరం చేసేందుకే దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.…

ఢిల్లీ పేలుళ్ల ఈమెయిల్‌కు కాశ్మీరుతో లింకు, ఇండియన్ ముజాహిదీన్ నుంచి మరో ఈమెయిల్

ఢిల్లీ హైకోర్టు వద్ద బుధవారం సంభవించిన బాంబు పేలుడుకు తమదే బాధ్యత అంటూ ‘హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ’ సంస్ధ పంపిన ఈ మెయిల్ కాశ్మీరు నుండి వచ్చినదిగా పోలిసులు తేల్చారు. కాశ్మీరులోని కీష్త్వర్ పట్టణంలోని ఒక సైబర్ కేఫ్ నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్ యజమానులైన సోదరులిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపారు. వారు వర్ణించినదాని ప్రకారం కొన్ని కీలకమైన క్లూలను సంపాదించినట్లు కూడా పొలీసులు గురువారం తెలిపారు. జమ్ము నుండి 230 కి.మీ…