హై అలర్ట్: ఆల్-ఖైదాకు వ్యతిరేకం కాదు అనుకూలం -నిపుణులు

ఆల్-ఖైదా నేతగా చెబుతున్న అయిమన్ ఆల్-జవహిరి వీడియో వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్ధితిని సమీక్షించి, భద్రతా సంస్ధలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను నిపుణులు విమర్శిస్తున్నారు. ‘హై అలర్ట్’ అంటూ ప్రకటించిన అప్రమత్తత చివరికి మైనారిటీ ప్రజలను పోలీసులు, ఇతర బలగాలు వేధింపులకు గురిచేసి భారత ప్రధాన స్రవంతి నుండి దూరం చేసేందుకే దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.…

ఉపఖండంలో ఆల్-ఖైదా, పశ్చిమ జోక్యానికి సూచిక

భారత ఉపఖండంలో ఆల్-ఖైదా విభాగాన్ని స్ధాపించినట్లు ఆల్-ఖైదా నేతగా చెప్పుకునే అయిమన్ ఆల్-జవహరి ప్రకటించాడు. ఈ విభాగం ద్వారా భారత ఉపఖండం అంతటా జీహాద్ విస్తరణకు పాటుపడనున్నట్లు తెలిపాడు. ఆన్-లైన్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఆల్-జవహరి ‘ఖైదత్ ఆల్-జిహాద్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో మొదట ఆల్-ఖైదా లేదా మరో పేరుతో టెర్రరిస్టులను ప్రవేశపెట్టడం,…