ట్రంప్ ఫ్యాక్టర్: 3 లక్షల ఇండియన్లు ఇంటికి?

భారత దేశం భయపడినదంతా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లోనే హెచ్1 బి వీసాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ నివాసులను త్వరలో ఇంటికి పంపే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు కొట్టివేసిన ముస్లిం వలసల నిషేధం డిక్రీని మళ్ళీ మరో రూపంలో జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్ధితుల్లోనూ తాను చెప్పింది చేసి తీరే వైఖరితో అమెరికన్ భారతీయుల గుండెల్లో గుబులు…

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు 2.4 లక్షలు

అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఏడవ స్ధానంలో ఉందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 2.4 లక్షల మంది భారతీయులు ఎటువంటి చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని, 2000, 2011 సంవత్సరాల మధ్య వీరి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని అమెరికా తెలిపింది. ఇదే కాలంలో  అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 84.6 లక్షల నుండి 1.151 కోట్లకు పెరిగిందని కూడా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మెక్సికోకి …