శ్రమ శక్తి ముందు యంత్ర శక్తి తల దించుకుంది! -వీడియో

యంత్రాలు ప్రవేశించాక ప్రతి ఉత్పత్తి రంగం లోనూ శ్రామికుడికి ఉపాధి కరువైంది. వేల యేళ్ళుగా మనిషి శ్రమ సాధించిన అనుభవమే జ్ఞానంగా పొగుబడి శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసింది. కానీ యంత్రాలను ఆస్తిగా మార్చుకున్న కొద్ది మంది శ్రమ చేయని వర్గాలు తమ సంపదలకు మూలం మనిషి శ్రమయే అన్న సంగతి మర్చిపోయి మనిషి శ్రమ/ కూలీ/ లేబర్ / శరీర శక్తిని ఈసడించుకోవడం మొదలు పెట్టాడు. యంత్రాలు మరింత అభివృద్ధి చెంది సూక్ష్మ రూపాలు…

ప్రశ్న: మన డేటా అమ్ముకుంటే నష్టం ఏమిటి?

లోకేశ్వర్: “వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి? (నాకు కూడా) సమాధానం:  ఈ అనుమానానికి చాలా పెద్ద సమాధానం, సమాచారం ఇవ్వాలి. విస్తృత విశ్లేషణ చెయ్యాలి. అందుకని కాస్త తీరికగా రాయొచ్చు అనుకున్నాను. మీరు రెండోసారి అడగడంతో క్లుప్తంగా రాస్తున్నాను. మనకొక ఉత్తరం వచ్చిందనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్…