మ్యాగి పురుగు పట్టిన మన ఆహార భద్రత -కార్టూన్

ఆహార భద్రత గురించి మన దేశ ప్రధానుల దగ్గర్నుండి ఛోటా మోటా ఐ.ఏ.ఎస్ అధికారుల వరకు చెప్పని కబురు లేదు. వాస్తవంలో భారత దేశ ఆహార భద్రత పురుగులు పట్టి కుళ్లిపోయిన యాపిల్ పరిస్ధితికి దిగజారిందని కార్టూనిస్టు వ్యంగ్యంగా చూపారు. 2 నిమిషాల్లో వండిపడేసే మ్యాగిలో ఆనారోగ్య కారక రసాయనాలు ఉన్నాయని తేలడంతో పలు రాష్ట్రాలు మ్యాగి శాంపిళ్ళను పరీక్ష చేయిస్తున్న నేపధ్యంలో మన ఆహార భద్రత పరిస్ధితిని ఈ కార్టూన్ వివరిస్తోంది. గత ఏప్రిల్ నెలలో…

ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…