ఆహార బిల్లును తప్పు పట్టొద్దు -ది హిందు సంపాదకీయం
(రూపాయి పతనానికి కారణంగా ఆహార భద్రతా బిల్లును కొంతమంది మార్కెట్ పరిశీలకులు చెప్పడాన్ని తప్పు పడుతూ ది హిందూ పత్రిక గురువారం, ఆగస్టు 29, 2013 తేదీన ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. పత్రిక వెలువరించిన అత్యద్భుతమైన సంపాదకీయాల్లో ఇది ఒకటి అనడంలో నాకు ఎట్టి సందేహం లేదు. రూపాయి పతనంకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -విశేఖర్) గత కొన్ని నెలల్లో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల…