ద్ర్యవ్యోల్బణం: హోల్ సేల్ 6.89%, రిటైల్ 9.47%
మార్చి నెలలో హోల్ సేల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 6.89 శాతానికి తగ్గితే, రిటైల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. రిటైల్ వ్యాపారులకి మాత్రమే అందుబాటులో ఉండే హోల్ సేల్ ధరలకీ, వినియోగదారులకి అందుబాటులో ఉండే రిటైల్ ధరలకీ ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. పాలు, కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, వంటనూనె ఉత్పత్తులు… వీటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ…