ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3

    నాటోకు కాల దోషం? అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ…

ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి

  2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు…

మోడి ఎక్స్ ప్రెస్ టు అమెరికా, వయా ఆస్ట్రేలియా -2

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం యురేనియం సరఫరా అన్నది సమాన స్ధాయి వ్యాపార సంబంధాల్లో భాగంగా జరిగినది కాదు. భారత దేశం అమెరికా, దాని మిత్ర దేశాలతో వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక సంబంధాలను మరింత దృఢతరం చేసుకుని, అమెరికా శిబిరానికి మరింత దగ్గర అయ్యే భౌగోళిక రాజకీయ అవసరం రీత్యానే యురేనియం సరఫరా అవుతుంది. అనగా యురేనియం ఇంధనాన్ని ఇచ్చి ఇండియా నుండి చైనా-రష్యా శిబిరంపై వ్యతిరేకతను అమెరికా సంపాదిస్తోంది. ఇది దళారీ పాలకుల లక్షణాల్లో ఒకటి.…

మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!

జి20 గ్రూపు దేశాల సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో భారత దేశ పటం చిన్నబోయింది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన వెంటనే క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూ.యు.టి) ని ప్రధాని మోడి సందర్శించగా యూనివర్సిటీ వారు కాశ్మీరు లేని భారత దేశాన్ని మోడి సందర్శనలో ప్రదర్శించారు. ఇదే వ్యవహారం యు.పి.ఏ ఏలుబడిలో జరిగితే హిందూత్వ సంస్ధల గగ్గోలు ఏ స్ధాయిలో ఉండేదో గానీ ఈసారి మాత్రం కిక్కురు మనలేదు.…

ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం

ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటన ఫలితంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు సంవత్సరాలుగా విడతలు విడతలుగా జరిగిన చర్చలు ఫలప్రదమై శుక్రవారం సంతకాలతో ఒప్పందం రూపం సంతరించుకున్నాయి. “పౌర అణు సహకార ఒప్పందం” గా పిలుస్తున్న ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం ఉంది. అమెరికా ‘ఊ’ అనకుండా ఒప్పందం సాధ్యం కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకందారు కానప్పటికీ ఆస్ట్రేలియాతో అణు…

MH370: చైనా శాటిలైట్ చిత్రంలో విమాన శిధిలాలు?

హిందూ మహా సముద్రంలోనే విమాన శిధిలాలు ఉన్నట్లు అనుమానించేందుకు మరో సాక్ష్యం లభించినట్లు తెలుస్తోంది. ఈసారి చైనా దేశానికి చెందిన శాటిలైట్ ‘గావోఫెన్ –1’ రికార్డు చేసిన చిత్రంలో తాజా ఆనవాళ్ళు లభ్యం అయ్యాయి. మార్చి 18 మధ్యాహ్నం సమయంలో శాటిలైట్ గ్రహించిన ఇమేజ్ లో 22 మీ. పొడవు, 30 మీ వెడల్పు ఉన్న వస్తువు కనపడినట్లు చైనా సమాచారం ఇచ్చిందని మలేషియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ కౌలాలంపూర్ లో విలేఖరులకు తెలిపారు. ఆస్ట్రేలియా…

ఆస్ట్రేలియా సమీపంలో విమాన శిధిలాలు? -ఫోటోలు

మార్చి 8 తేదీన అదృశ్యం అయిన విమానానికి సంబంధించి ఒక ఆశాజనక వార్త వెలువడింది. ఆస్ట్రేలియా ప్రధాని ఈ వార్తకు కర్త. ఆస్ట్రేలియాకు పశ్చిమ తీరాన ఉండే పెర్త్ నగరానికి వాయవ్య దిశలో దక్షిణ హిందూ మహా సముద్రంలో విమాన శిధిలాలుగా భావించదగ్గ రెండు వస్తువులు కనిపించాయన్నది ఈ వార్త సారాంశం. మార్చి 16 నాటి శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ వస్తువులను కనిపెట్టారు. వీటిలో ఒకటి 78 అడుగుల పొడవు ఉండగా మరొకటి 15 అడుగుల…

ఆస్ట్రేలియా గూఢచర్యం: రాయబారిని వెనక్కి పిలిచిన ఇండోనేషియా

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు సాగిస్తున్న గూఢచర్యం పై ఎలా స్పందించాలో ఇండోనేషియా ఒక ఉదాహరణ చూపింది. తమ అధ్యక్షుడి టెలిఫోన్ సంభాషణలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిఘా పెట్టిందన్న విషయం స్నోడెన్ పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన రోజే ఆ దేశం నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో తాము కుదుర్చుకున్న స్నేహ, సహకార ఒప్పందాలు అన్నింటినీ సమీక్షిస్తున్నట్లు కూడా ఇండోనేషియా ప్రకటించింది. అమెరికా గూఢచర్యం అసలు గూఢచర్యమే కాదు పొమ్మన్న భారత పాలకులతో…