ఆస్ట్రేలియా మీదుగా అమెరికా వెళ్ళు మోడి రైలు -1

భారత ప్రధాని నరేంద్ర మోడి నవంబరు 11 నుండి 20 వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చారు. మియాన్మార్ పర్యటనలో ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సభకు హాజరయిన మోడి ఆస్ట్రేలియా పర్యటనలో జి-20 గ్రూపు సమావేశాలకు హాజరయ్యాడు. ఈ పర్యటనలో మోడియే ప్రధాన ఆకర్షణ అని చెప్పుకుని భారత పత్రికలు మురిసిపోయాయి. వామపక్ష భావాలు కలిగి ఉన్నట్లు భావించే ది హిందు పత్రిక సైతం ఈ పత్రికల్లో ఒకటిగా ఉండడం గమనార్హం. అంటరాని నేతగా దాదాపు ప్రపంచం…